కరోనా కేసుల్లో పోటీ పడుతున్న గుంటూరు, నరసరావుపేట !

Update: 2020-05-06 11:30 GMT
ఏపీలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అయితే , ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో ఎక్కువగా టెస్టులు చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా కేసులు బయటపడుతున్నాయి అని చెప్తుంది. గత పది రోజులుగా ప్రతి రోజు కూడా సగటున 60 కి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా కరోనా కేసుల్లో గుంటూరు నగరం, నరసరావుపేట పోటీ పడుతున్నాయి. తాజాగా బుధవారం కొత్తగా మరో 12 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 363కు చేరింది. వీటిలో అత్యధిక కేసులు కేవలం గుంటూరు నగరం, నరసరావుపేటలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు నగరంలో కోవిడ్‌ బాధితుల సంఖ్య 162 కాగా.. నరసరావుపేటలో 163కు చేరింది. దీంతో కరోనా కేసుల్లో గుంటూరును నరసరావుపేట మించిపోయింది. దీంతో జిల్లాలో అత్యధిక కేసులు నమోదైన నరసరావుపేట పట్టణంలో కరోనా వైరస్‌ నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అదే మిషన్ 15 .

అంటే రాబోయే 15 రోజుల తర్వాత కొత్త కేసులు ఉండరాదనే లక్ష్యంతో అధికార యంత్రాంగం పనిచేస్తోంది. అయితే జిల్లావ్యాప్తంగా ఇంకా 500కు పైగా శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా తో 8 మంది మరణించగా.. 129 మంది కోలుకుని డీఛార్జ్ అయ్యారు. ఇంకా 226 మంది గుంటూరు ఐడీ, మంగళగిరి ఎన్‌ ఆర్‌ ఐ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 17వ తేదీ వరకు లాక్‌ డౌన్‌ యథావిధిగా కొనసాగుతుందని.. ఎలాంటి సడలింపులు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.
Tags:    

Similar News