దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. ఒకే చోట ఎక్కువ మందికి పాజిటివ్ లక్షణాలు తేలుతున్నాయి. ఢిల్లీ లో గత కొన్ని రోజులుగా వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఒకే బిల్డింగులో 41 మందికి వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు. కపాషెరాలోని జిల్లా థెకే వ్యాలీలో ఇది చోటు చేసుకుంది. ఒక్క వ్యక్తి కారణంగా వీరందరికి వైరస్ సోకడంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.
కొన్ని రోజుల క్రితం ఈ భవనంలో ఒకరికి కరోనా సోకింది. దీంతో అతన్ని ఐసోలేషన్ కు తరలించారు. అయితే , ఆ తర్వాత భవనాన్ని పూర్తిగా మూసేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. వారి నమూనాలను నోయిడాలోని టెస్టింగ్ సెంటర్ కు పంపగా 41 మందికి రిజల్ట్ పాజిటివ్ వచ్చిందన్నారు. దీంతో ఆ బిల్డింగ్ చుట్టు పక్కల నివాసముంటున్న 175 మంది నుంచి నమూనాలు సేకరించిన అధికారులు ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు.
కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 3,738 కరోనా కేసులు నమోదవగా - 61 మంది వైరస్ బాధితులు మరణించారు. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కంటైన్మనెంట్ జోన్లను గుర్తించి లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.