వణుకు పుట్టిస్తున్న కరోనా.. భారీగా పెరిగిన కేసులు..!

Update: 2022-01-21 06:06 GMT
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచం అంతా అల్లకల్లోలం సృష్టిస్తోంది.

ఇప్పటికే ప్రపంచం దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి.

కేవలం గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే ప్రపంచం వ్యాప్తంగా కొవిడ్ కేసులు 34 లక్షలకు పైగా నమోదు అయ్యాయి. మరో వైపు మరణాలు కూడా భారీగా పెరిగాయి.

 అత్యధికంగా కేసులు, మరణాలు అమెరికాలో నమోదు అయ్యాయి. సుమారు 2 వేలకు పైగా మంది వైరస్​ కారణంగా చనిపోయారు.

 అగ్రరాజ్యం అమెరికాలో సుమారు 7 లక్షల కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు మిగతా దేశాలతో పోల్చితే  మన దేశంలో కూడా కేసులు సంఖ్య భారీగా పెరిగింది.

శుక్రవారం కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన దాని ప్రకారం కేసుల సంఖ్య సుమారు 3 లక్షల 50 వేలకు సమీపించింది. గురువారం 8 గంటల నుంచి శుక్రవారం 8 గంటల వరకు చేసిన పరీక్షల్లో ఈ కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

మరో వైపు వైరస్​ తో దేశంలో 703 మంది చనిపోయారు.  మరణాల సంఖ్య రోజురోజుకు పెరగడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఈ రోజు వెలుగు చూసిన మరణాల సంఖ్యతో మొత్తం మరణాల సంఖ్య 4,88,396కు చేరింది.

ఇదిలా ఉంటే క్రమక్రమంగా వైరస్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య మరింత పెరిగింది. ఈ ఒక్కరోజులో 2 లక్షల 51 వేల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,60,58,806 కు చేరింది. మరో పైపు దేశంలో పాజిటివిటీ రేటు రోజు రోజుకు భారీగా పెరిగిపోతుంది. కేంద్రం వెల్లడించిన దాని ప్రకారం ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 17.94కు చేరింది.

మరో వైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం కొత్త వేరియంట్​ కేసుల సంఖ్య 9,692కు చేరింది.

ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అంతేగాకుండా దేశ వ్యాప్తంగా 70,49,779 మందికి కొవిడ్​ డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం డోసులు 160 కోట్లను దాటింది.
Tags:    

Similar News