కరోనా అన్నంతనే వణికినోళ్లంతా ఇప్పుడు పిచ్చ లైట్ తీసుకోవటం తెలిసిందే. ఇంకెక్కడి మహమ్మారి అండి.. మొత్తంగా తోక ముడిచింది. మన దగ్గర ఉండే దమ్ము.. ధైర్యం దానికి ఉందా? మనం ఇంత విచ్చలవిడిగా తిరిగినా కేసుల సంఖ్య చూశారా? అదీ మన కెపాసిటీ.. అంటూ మాటలు చెప్పే వాళ్లంతా కాస్త తగ్గాల్సిందే. మిగిలిన ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా.. తెలుగోళ్లు అత్యధికంగా ఉండే మహానగరమైన హైదరాబాద్ లో తాజాగా వెలుగు చూసిన ఉదంతం షాకింగ్ గా మారటమే కాదు.. కొత్త భయాన్ని రేపేలా మారింది.
హైదరాబాద్ శివారులోని బహదూర్ పల్లి.. (ఎక్కడో అనుకునేరు.. జీడిమెట్ల.. చింతల్.. కుత్భుల్లాపూర్.. షాపూర్.. నిజాంపేట.. బాచుపల్లి.. ప్రగతినగర్ లకు కాసింత దూరమే) లో ఉన్న టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం రేగింది. ఈ విద్యా సంస్థలో చదివే విద్యార్థుల్లో పలువురికి కరోనా పాజిటివ్ గా తేలింది. అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వర్సిటీకి చెందిన పాతిక మంది విద్యార్థులకు.. ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. విద్యార్థులు బస చేసే హాస్టల్స్ ను ఖాళీ చేయించారు.
మొత్తం వర్సిటీ ప్రాంగణాన్ని శానిటైజ్ చేయాలని డిసైడ్ చేశారు. వైరస్ బారిన పడిన విద్యార్థుల పరిస్థితి సీరియస్ గా ఏమీ లేదని.. ప్రస్తుతం వారంతా హోం ఐసోలేషన్ లోనే ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇంత భారీగా కేసులు నమోదయ్యే వరకు ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారు? అన్నది ప్రశ్నగా మారింది.
ఈ కేసులకు మూలం ఏమిటి? ఎక్కడ నిర్లక్ష్యం దొర్లింది? తప్పు ఎవరిది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. ఇటీవల కాలంలో ఒకే ప్రాంతంలో ఇంత భారీగా ఇన్ని కేసులు ఒకేసారి వెలుగు చూడటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. సో.. హైదరాబాదీలు జర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చేసిందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.