కరోనా మహమ్మారి బారి నుంచి తప్పించుకోవడానికి భారత్ లో రెండో విడత లాక్ డౌన్ కూడా అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్ తో పాటు ట్రాకింగ్ - ట్రేసింగ్ - టెస్టింగ్(టీటీటీ) ద్వారానే కరోనాను కట్టడి చేయగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఎన్ని ఎక్కువ టెస్టులు చేస్తే అంత మంచిదని...130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో గురువారం నాటికి సుమారు 5 లక్షల మందికి మాత్రమే టెస్టులు చేయగలిగాం. దీంతో, మరిన్ని టెస్టులు చేయాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ లో ప్రతి 10 లక్షల మంది జనాభాలో 300 మందికి మాత్రమే టెస్టులు చేయగలుగున్నాం. ఈ సంఖ్య మరింత పెరగాల్సి ఉందని వైద్య నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన ప్రపంచంలో అతి తక్కువ కరోనా పరీక్షలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. లాక్ డౌన్ వల్ల వైరస్ వ్యాప్తి కొద్దిగా తగ్గినా..పూర్తిగా తగ్గిందని చెప్పలేము. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటికి కేసుల సంఖ్య 16 వేలకు పైగా పెరిగింది. ఏప్రిల్ 6 తర్వాత ప్రతి రోజూ సగటున 25 కరోనా మరణాలు నమోదవుతున్నాయి. అమెరికా - యూరప్ దేశాలతో పోలిస్తే వైరస్ వ్యాప్తి - మరణాల విషయంలో ఈ వేగం తక్కువే.
నెల రోజుల లాక్ డౌన్ పూర్తయినప్పటికీ.. కరోనా కేసులు పెరుగుతుండడం ఓ వైపు కలవరపెడుతోంది. అయితే, కరోనాపై ఉన్న గణాంకాలను పరిశీలిస్తే భారత్ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెస్టర్న్ కంట్రీస్ లో 5 లక్షల టెస్టులు పూర్తయ్యే సరికి సగటున లక్ష పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కానీ భారత్ లో 5వ వంతు మాత్రమే బయటపడ్డాయి. భారత్ లో కరోనా టెస్టులు జరిపిన ప్రతి 100 మందిలో సగటున నలుగురికి (4.6%) మాత్రమే పాజిటివ్ రిజల్ట్ వస్తోంది. ఈ నెల రోజుల లాక్ డౌన్ లో ఏ రోజూ సగటులో పెద్దగా మార్పు లేదు. కానీ అమెరికాలో ఏకంగా ప్రతి 100 టెస్టుల్లో 65 పాజిటివ్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. భారత సగటు కంటే అమెరికా సగటు చాలా ఎక్కువగా ఉంది. ఇది గణాంకాలు చెబుతున్న మాట. అయితే.. ఆయా దేశాల్లో వైద్య పరీక్షలు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి అక్కడ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని, మన దగ్గర టెస్టుల సంఖ్య తక్కువ కాబట్టి ఇక్కడ కేసుల సంఖ్య తక్కువగా ఉందన్నది కొందరి వాదన.
అయితే, టెస్టుల సంఖ్యకు పాజిటివ్ కేసుల సంఖ్యకు సంబంధం లేదని ‘అవర్‌వరల్డ్ ఇన్ డేటా.ఆర్గ్’ చెబుతోంది. ఏప్రిల్ 18 నాటికి మనదేశంలో ప్రతి 1000 మందిలో 0.27 శాతం మందికే పరీక్షలు చేయగా.. దక్షిణకొరియాలో ప్రతి 1000 మందికి 10.77 శాతం మందికి పరీక్షలు చేశారు. అమెరికాలో 10.73 శాతం మందికి, ఇటలీలో 22 శాతం మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్ కన్నా ఎక్కువ టెస్టులు చేసిన దక్షిణ కొరియాలో భారత్ కన్నా తక్కువ కరోనా పాజిటివ్ కేసులున్నాయి. దక్షిణ కొరియాతో సమానంగా పరీక్షలు చేసిన అమెరికాలో 7 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య విషయంలోనూ అమెరికాలో పరిస్థితి దారుణంగా ఉండగా.. కొరియాలో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది.ఇటలీకి.. దక్షిణకొరియాకు మధ్య వైద్యపరీక్షల సంఖ్యలో తేడా 12 శాతం కాగా.. ఇటలీలో ఇన్ఫెక్షన్లు, మరణాల సంఖ్య చాలా రెట్లు ఎక్కువగా ఉంది.
ఈ గణాంకాలను పరిశీలిస్తే టెస్టులకు, పాజిటివ్ కేసులకు కచ్చితమైన సంబంధంగానీ, ఒక క్రమ పద్ధతిగానీ లేనట్టు అర్థమవుతుంది. టెస్టుల సంఖ్య పెరిగే కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం కొంత మేరకు వాస్తవమే. అలాగని భారత్ వంటి కొన్ని దేశాల్లో వైరస్ ఉధృతి తక్కువగానే ఉన్నట్టు, మరీ ప్రమాదకరమైన పరిస్థితిలు లేనట్టు కనిపిస్తోంది. అయితే, ఈ గణాంకాలను చూసుకొని కరోనా టెస్టుల సంఖ్య తగ్గించినా...నెమ్మదిగా చేసినా కూడా ప్రమాదమే అన్న సంగతి మరచిపోకూడదు. కరోనాను అడ్డుకోవాలంటే లాక్ డౌన్ తో పాటు....టెస్ట్ ట్రేస్ ట్రీట్...కొనసాగించడమే ఉత్తమం. కరోనా పరీక్షలు ఎక్కువగా చేయాల్సిందేనని, అపుడే కరోనా వ్యాప్తిని పూర్తిగా నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు, 40 రోజుల తర్వాత లాక్ డౌన్ పొడిగించడం సరికాదని....ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్న నేపథ్యంలో లాక్‌డౌన్ పరిమితిని మరీ ఎక్కువ కాలం పొడిగించే పరిస్థితీ లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ కేసులన్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించి మిగతా చోట్ల లాక్ డౌన్ ను సడలించవచ్చని, తద్వారా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. లాక్ డౌన్ ను ఎత్తేయాలంటే వీలైనంత ప్రతి పాజిటివ్ కేసునూ గుర్తించాలని, అందుకే ఏకైక మార్గం ఎక్కువగా టెస్టులు చేయడమేనని అంటున్నారు.