కరోనా వైరస్..ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికించేస్తోంది. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఇండియాలో కొందరికి వచ్చినట్లు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్ చైనాని అతలాకుతలం చేస్తుంది. ఇప్పటికే దాదాపుగా 200 మంది ఈ వైరస్ భారిన పడి చనిపోయినట్టుగా సమాచారం. అలాగే పదివేలమందికి పైగా ఈ వ్యాధి సోకినట్టు చెప్తున్నారు. దీనిపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది.
ఇకపోతే , ఎప్పుడు ఈ కరోనా దెబ్బ ఆంధ్రా మిర్చి రైతులకి కూడా తగిలింది. అసలు ఆంధ్రామిర్చి రైతులకి , కరోనా సెగ ఏంటి అని అనుకుంటున్నారా .. జనవరి ఆరంభంలో క్వింటా మిర్చి రూ.20 వేలు పలికింది. పది రోజుల కిందట రూ.10 వేలకు పడిపోయినా మళ్లీ రేటు పెరిగింది. 16 నుంచి 20 వేల మధ్య కొనుగోళ్లు సాగాయి. రెండు రోజుల క్రితం వరకూ 18 నుంచి 20 వేలకు కొన్నారు. ఇప్పుడు హఠాత్తుగా ధర 10 వేలకు పడిపోయింది. కారణం.. కరోనా.
చైనాలో ప్రబలిన కరోనా వైరస్ ప్రభావం తో విదేశాలకు మిర్చి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఇది తూర్పుగోదావరి జిల్లా కుక్కునూరు ప్రాంతం లో పరిస్థితి. ఇక మిర్చికి ప్రసిద్ధి చెందిన గుంటూరు లోనూ ఇదే పరిస్థితి. గుంటూరు లో కొనుగోలు చేసిన మిర్చిని వ్యాపారులు చైనా, వియత్నాం, మలేషియా, థాయ్‌లాండ్, మెక్సికో వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కరోనా ప్రభావం తో ఈ దేశాలు దిగుమతులు నిలిపేశాయి. ఈ కారణంతో మిర్చి ధర భారీగా పతనమైంది.