కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచంలోని అన్ని దేశాలు అతలాకుతలం అయ్యాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా క్షీణించాయి. అగ్రరాజ్యం, చిన్న దేశాలు అనే తేడా లేకుండా వైరస్ విశ్వరూపం చూపించింది. యూరప్ దేశాలూ తీవ్రంగా నష్టపోయాయి. ప్రపంచంలోనే నివాసయోగ్యంగా ఉండే యూరప్ దేశాలు వాటి స్థానం కోల్పోయాయి. చాలా నగరాల స్థానాలు తారుమారు అయ్యాయి.
కొవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాల్లోని నగరాలు అగ్రస్థానంలో నిలిచాయి. కఠిన నిబంధనలు అమలు చేసి మహమ్మారి విజృంభనను నియంత్రించిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని నగరాలు ప్రపంచంలోనే నివాసయోగ్యమైన నగరాల జాబితాలో నిలిచాయి. వైరస్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నందునే ఈ స్థానం దక్కింది.
నివాసయోగ్యమైన నగరాల జాబితాలో న్యూజిలాండ్ రాజధాని అక్లాండ్ తొలి స్థానాన్ని సంపాదించుకుంది. కరోనాను ఎదుర్కోవడంలో విఫలమైన నగరాలు నివాసయోగ్యం కాని నగరాల జాబితాలో చేరాయి. సిరియాలోని డమాస్కస్ ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది. ఈ నగరం నివాసయోగ్యం కాదని పేర్కొంది. దీనితో పాటు మరికొన్ని దేశాల్లోని నగరాలు నివాసయోగ్యం కాని జాబితాలో చేరాయి.
ఈ సారి ఉపాధి, ఆర్థిక రంగాలేనే కాకుండా ఆరోగ్య వ్యవస్థను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాలను రూపొందించారు. ఎప్పుడూ తొలి స్థానం ఆక్రమించుకునే యూరప్ దేశాలు ఈసారి ఆ స్థానాన్ని కోల్పోయాయి. వైరస్ ను ప్రభావవంతంగా ఎదుర్కొన్న నగరాలు చేజిక్కించుకున్నాయి.