కరోనా దెబ్బకి బ్రెయిన్ పాడైపోతుందట .. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు

Update: 2021-06-29 14:30 GMT
కరోనా మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మందికి నీరసం, శ్వాసకోస సమస్యలు, జ్వరం, గొంతులో మంట, చర్మంపై దద్దుర్లు వంటివి వచ్చాయి. అయితే , కరోనా  బ్రెయిన్‌పై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని ఇప్పటివరకూ అనుకోలేదు. కేవలం తలనొప్పి, బ్రెయిన్ ఫాగ్, వాసన, రుచి తెలియకపోవడం వంటివి మాత్రమే సమస్యలు వస్తాయని అనుకున్నారు. కానీ కొత్తగా జరిపిన పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కరోనా మనుషుల బ్రెయిన్‌ పై చాలా ఎక్కువ ప్రభావమే చూపిస్తోంది. కరోనా దేశంలోకి వచ్చిన కొత్తలో  ప్రజలకు వాసన, రుచి మాత్రమే తెలియలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరిన్ని నాడీ సంబంధిత సమస్యలు బయటపడ్డాయి. అంటే తలనొప్పి, వికారం, వాంతులు రావడం, తీవ్రమైన అలసట వంటివి కనిపించాయి. న్యూయార్క్‌ లోని కొలంబియా యూనివర్శిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ టి టాగూర్  వాషింగ్టన్ పోస్టుకు చెప్పిన దాని ప్రకారం  బ్రెయిన్‌ పై దాడి చేసే వైరస్‌ లను నాశనం చెయ్యడం కష్టం. ఎందుకంటే  మిగతా శరీరంతో బ్రెయిన్ కలవకుండా ఓ అడ్డుగోడ లాంటిది బ్రెయిన్‌కి ఉంటుంది. గత వారం మెడ్జివ్ ఓ ప్రి-ప్రింట్ వెర్షన్  రిలీజ్ చేసింది. ఈ పరిశోధనా పత్రంలో ఏం చెప్పిందంటే కరోనా సోకిన వారికి, గ్రేమ్యాటర్ అనేది మిస్సవుతోంది. ఇది ఓల్ఫాక్టరీ, గస్టాటొరీ సిస్టమ్ చుట్టూ ఉంటుంది. మెమరీకి సంబంధించిన ప్రాంతంలో ఈ గ్రే మ్యాటర్ మిస్సవుతోంది. బ్రెయిన్‌ లో గ్రే మ్యాటర్ తగ్గిపోవడం అనేది, కరోనా సోకడం వల్లే జరుగుతోంది. దీని వల్ల బ్రెయిన్ బరువు తగ్గుతోంది. ఈ పరిస్థితి చాలా కాలం ఉంటుంది.

ఇన్ఫెక్షన్ తొలగిపోయి, వ్యక్తి రికవరీ అయినా బ్రెయిన్ బరువు తగ్గిన డ్యామేజీ ఎక్కువ కాలం ఉంటుంది. కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న వారిలో కూడా ఈ గ్రే మ్యాటర్ తగ్గిపోవడం కనిపించింది. దీని వల్ల మెమరీ సంబంధింత సమస్యలు వస్తాయి. బ్రిటన్ లోని దీర్ఘకాలిక పరిశోధన, డేటా కేంద్రమైన యూకే బయోబ్యాంక్ నుంచి డేటా తీసుకొని పరిశోధించారు. ఈ సంస్థ లోతైన డేటా, వవరాలు సేకరిస్తోంది. కరోనా వచ్చిన కొత్తలోనే ఈ సంస్థ 40,000 మందిని పరిశీలించింది. వారి ఆరోగ్య వివరాల డేటాను పొందుపరిచింది. కరోనా పూర్తిగా వచ్చాక  ఈ సంవత్సరం వారిలోని వందల మందిని తిరిగి పిలిచి మరోసారి వారిని స్కాన్ చేసింది. 
Tags:    

Similar News