కరోనా ఎఫెక్ట్ : అమెరికాలో ఇద్దరు భారతీయులు మృతి !

Update: 2020-04-01 11:50 GMT
కరోనా వైరస్ ..రోజురోజుకి ప్రపంచం అంతా వేగంగా విస్తరిస్తూపోతుంది. అలాగే ఈ కరోనా వైరస్ వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంటుంది. ముఖ్యంగా ఇటలీ , స్పెయిన్, అమెరికాలో మరణ మృదంగం  మోగిస్తుంది. ఇకపోతే అమెరికాలో కరోనా  తాజాగా ఇద్దరు భారతీయుల ఉసురు తీసింది. ఇప్పటికే  ఇరాన్, ఇటలీ, స్పెయిన్ దేశాలలో ఒక్కరు చొప్పున ముగ్గురు భారతీయులను బలిగొన్న కరోనా వైరస్ బుధవారం మరో ఇద్దరు భారతీయులను అమెరికాలో పొట్టన బెట్టుకుంది.

కరోనా వైరస్‌తో బాధపడుతూ న్యూయార్క్‌ లో ఒకరు, న్యూజెర్సీ లో మరొకరు మృత్యువాత పడ్డారు. కేరళకు చెందిన 43 ఏళ్ల థామస్ డేవిడ్ న్యూయార్క్‌ లో మృతి చెందగా.. అదే కేరళలోని ఎర్నాకులానికి చెందిన 85 ఏళ్ల కుంజమ్మ శామ్యూల్ న్యూజెర్సీ లో మృత్యువాత పడ్డారు. దాంతో విదేశాలలో కరోనా తాకిడితో మృతి చెందిన భారతీయుల సంఖ్య అయిదుకు చేరింది.

గతంలో స్పెయిన్‌లో తమిళనాడుకు చెందిన వ్యక్తి చనిపోగా.. ఇరాన్‌లో ఒకరు, ఇటలీలో మరొకరు గతంలో మృతి చెందారు. తాజాగా అమెరికాలో ఇద్దరు భారతీయులను కరోనా బలిగొనడంతో మొత్తం ఆ  సంఖ్య 5కు చేరింది.  కాగా కరోనా వైరస్ కారణంగా పంచవ్యాప్తంగా ప్రస్తుతం 8,61,113పాజిటివ్ కేసులు నమోదు కాగా, 42,385 మంది మృతి చెందారు. 
Tags:    

Similar News