కరోనా ఎఫెక్ట్ : నాలుగు నిముషాల్లో పెళ్లి ..ఎలా జరిగిందంటే !

Update: 2020-04-06 23:30 GMT
కరోనా మహమ్మారి .. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ కరోనా కి సరైన వ్యాక్సిన్ లేకపోవడం తో సామజిక దూరం ఒక్కటే కరోనాను అరికట్టడానికి మార్గం కావడంతో ప్రపంచంలోని మెజారిటీ దేశాలు ..లాక్ డౌన్ ను విధించాయి. అయినప్పటికీ , కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇకపోతే ఈ వైరస్ కారణంగా జనాలు పిట్టలు  రాలిపోయినట్లు రాలిపోతున్నారు. అయితే, లాక్ డౌన్ ప్రకటించక ముందు చాలా మంది పెళ్లిళ్లు నిశ్చయం చేసుకున్నారు. కేంద్రం ప్రకటన తో చాలా మంది వాయిదా వేసుకున్నారు. కొందరు బుక్  చేసుకున్న కళ్యాణ మండపాలు మూత పడ్డాయని, ఇంటి వద్ద పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ జంట కేవలం నాలుగు నిమిషాల్లో తమ పెళ్లి తంతు ముగించారు.

అతి కొద్దీ మంది సమక్షంలో ఈ వివాహ వేడుకలు జరుగుతున్నాయి. తాజాగా మైసూర్ లో ఓ పెళ్లి వేడుక కేవలం నాలుగు నిమిషాల్లో పూర్తవడం వైరల్ గా మారింది. ఈ సంఘటన బళ్లారిలో చోటు చేసుకుంది. వాళ్లు కూడా అందరిలాగేనే గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ.. కరోనా వచ్చి లాక్ డౌన్  లాక్ డౌన్ అయిపోయింది కదా. పెళ్లి వాయిదా వేసుకుందామని అనుకున్నారు. కానీ.. ఆ తర్వాతైనా బంధువులు వస్తే , మళ్లీ కరోనా రాదు అన్న గ్యారెంటీ లేదు. దీనితో 2020, ఏప్రిల్ 05వ తేదీ ఆదివారమే మాంగల్యం తంతునేనా అనిపించారు. కేవలం నాలుగు నిమిషాల్లోనే పెళ్లి  తంతు ముగించేశారు.

సిద్ధాపురం గ్రామానికి చెందిన రోహిణి(20), మధు(25) ప్రేమించుకున్నారు. వారి ప్రేమను రెండు కుటుంబాల  పెద్దలు అంగీకరించారు. పెళ్లి ముహుర్తం దగ్గరపడే సమయానికి లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో చేసేది లేక.. వధువు, వరుడు వాళ్ల తల్లిదండ్రులు.. పూజారి తో వెళ్లి.. నాలుగంటే నాలు నిమిషాల్లో పెళ్లి తంతు ముగించారు. కేవలం వెళ్లారు.. తాళి కట్టించుకున్నారు వచ్చేశారు.
Tags:    

Similar News