స్కూళ్ళు ఇలా తెరిచారో లేదో వెంటనే అలా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే నాలుగు జిల్లాల్లోని స్కూళ్ళల్లో కొందరు టీచర్లు, విద్యార్థులకు కరోనా వైరస్ అంటుకుంది. దాంతో ఆ స్కూళ్ళను ప్రభుత్వం మూయించేసింది. ప్రకాశం జిల్లా, కృష్ణా, నెల్లూరు, విజయనగరంలోని ఒక్కో స్కూలులో మొత్తం కలిపి సుమారు 50 మంది విద్యార్థులకు వైరస్ ఎటాక్ అయ్యింది. అలాగే 20 మంది టీచర్లకు కూడా వైరస్ సోకింది. దాంతో ఆయా స్కూళ్ళను మూసేశారు.
టీచర్లు, విద్యార్ధులకు కరోనా వైరస్ సోకగానే మిగిలిన టీచర్లు, విద్యార్ధులతో పాటు స్కూళ్ళల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజనం సిబ్బందికి కూడా టెస్టులు చేయిస్తున్నారు. వీళ్ళందరి సమస్య ఒకఎత్తయితే విద్యార్ధుల తల్లి, దండ్రులకు అలాగే టీచర్ల కుటుంబసభ్యులకు కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించాల్సిరావటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.
ఒక్కో స్కూలులో 200 మంది విద్యార్ధులంటారని అనుకున్నా అందరు విద్యార్ధులతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా టెస్టులు చేయించాల్సి రావటంతో స్ధానిక అధికారయంత్రాంగం కూడా వెంటనే అప్రమత్తమైంది. ఎందుకంటే టీచర్ కు వచ్చినా లేదా స్టూడెంట్ కు సోకినా అది వాళ్ళ ఒకళ్ళతోనే పోదన్న విషయం అందరికీ తెలిసిందే. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ స్కూల్లో చదువుతున్న పదిమంది విద్యార్ధులకు కరోనా సోకడంతో స్కూలును వారం రోజుల పాటు మూసేశారు. తాజాగా ఏ స్కూల్లో అయినా 5 కేసులు బయటపడితే క్వారంటైన్ కోసమని 15 రోజులు స్కూల్ మూసేయాలని విద్యాశాఖ డిసైడ్ చేసింది.
ప్రభుత్వం స్కూళ్ళను తెరవటం కరోనా వైరస్ సోకిందని మూసేయడం మామూలైపోయింది. గతంలో కూడా కరోనా ఉధృతి తగ్గిందని అనుకోగానే ప్రభుత్వం స్కూళ్ళను తెరిచేసింది. దాంతో వెంటనే విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా కరోనా వైరస్ సోకింది. దాంతో అప్పటికప్పుడు మళ్ళీ అన్నీ స్కూళ్ళను ప్రభుత్వం మూయించేసింది. ఇంత గ్యాప్ తర్వాత స్కూళ్ళను తెరవగానే మళ్ళీ కరోనా వైర్ బయటపడుతోంది. పైగా అక్టోబర్ కు థర్డ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంటుందనే నిపుణుల హెచ్చరికలు అందరు చూస్తున్నదే. మరి కేసులు బయటపడుతున్న నేపథ్యంలో ఈసారి ఏమి చేస్తుందో చూడాల్సిందే.