దేశంలో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా ఎన్నంటే ?

Update: 2020-09-01 07:00 GMT
దేశంలో  కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ మరింత వేగంగా.. ఊహించని విధంగా విసిగిస్తూ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 69921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 36లక్షల 91వేల 166కి పెరిగింది. అలాగే కే, 819 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 65వేల 288కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.8 శాతంగా అంటే... ప్రతీ వెయ్యి మంది కరోనా సోకిన వారిలో 18 మంది మృత్యువాత పడుతున్నారు.

అలాగే దేశంలో తాజాగా మరో 65081 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో మొత్తం రికవరీ కేసుల సంఖ్య 28లక్షల 39వేల 882గా ఉంది. దేశంలో రికవరీ రేటు 76.9 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 785996 ఉన్నాయి.ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో... అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. అలాగే... కొత్త కేసుల నమోదులో భారతదేశం 27 రోజులుగా టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది. రోజువారీ మరణాల్లో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత బ్రెజిల్, అమెరికా ఉన్నాయి.
Tags:    

Similar News