లవర్ తో మాట్లాడటానికి తల్లి అడ్డుగా ఉందని, ఆ ప్రియుడు ఏంచేసాడంటే !

Update: 2020-08-28 23:30 GMT
కాలేజ్ లో తనతో పాటు చదువుకునే  విద్యార్థిని తనతో ఎంతో చనువుగా ఉందని ఆ  అబ్బాయి చాలా ఆనందపడ్డాడు.  ప్రతిరోజు కాలేజ్ లో అమ్మాయి, అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలోనే ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఈ కథ ఇలా సాగుతున్న నేపథ్యంలో  కరోనా వైరస్  పుణ్యమా అంటూ లాక్ డౌన్ విధించడం, కాలేజ్ మూసివేయడంతో ఆ అమ్మాయిని చూసే అవకాశం లేదు.  దీనితో  ఆవేదన చెందాడు. లాక్ డౌన్ సందర్బంగా అమ్మాయిని కలవడానికి, కనీసం ఫోన్ లో మాట్లాడటానికి ఆ అబ్బాయికి అవకాశం చిక్కలేదు. తనతో తన ప్రియురాలు మాట్లాడటానికి ఆమె తల్లి అడ్డు పడుతోందని ప్రియుడు రగిలిపోయాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ప్రియురాలి తల్లి మీద పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు ప్రారంభించి ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడంతో ఆమె మానసిక వేదనకి గురై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

దీనిపై పూర్తి వివరాలు చూస్తే .. చెన్నైసిటీలో శ్రీమంతులు నివాసం ఉండే అశోక్ నగర్ ప్రాంతంలో 40 ఏళ్ల మహిళా పారిశ్రామికవేత్త నివాసం ఉంటున్నారు. ఈమె 17 ఏళ్ల కుమార్తె చెన్నై సిటీలోని ప్రముఖ కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. చెన్నైలోని తౌజండ్స్ లైట్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల అబ్బాయి అదే కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు, మహిళా పారిశ్రామికవేత్త కుమార్తె, అబ్బాయి స్నేహితులు. వారిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి క్యాంటిన్, సినిమాలు, షికార్లకు వెళ్లేవారని తెలిసింది. గత మార్చి నెల వరకు ఇద్దరు కలిసి కాలేజ్ లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడుకునే వాళ్లు.  ఈ మద్యంలోనే ఆ  అమ్మాయితో అబ్బాయి ప్రేమలో పడ్డాడు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ అమలు చెయ్యడంతో కాలేజ్ మూసివేయడంతో అమ్మాయి, అబ్బాయి దూరం అయ్యారు. ఇదే సమయంలో అమ్మాయిని కలవడానికి అబ్బాయి చాలా ప్రతయ్నాలు చేశాడు.  చెన్నైలో కరోనా మరీ ఎక్కువగా ఉండటంతో  సాద్య పడలేదు.

రెండు నెలల ముందు కాలేజ్ అమ్మాయికి ఫోన్ చేసిన అబ్బాయి ఐ లవ్ యూ చెప్పాడు. నేను నిన్ను ఫ్రెండ్ గా మాత్రమే చూశానని, నేను నిన్ను ప్రేమించలేదని కూల్ గా చెప్పింది. తనతో ఇంతకాలం ఎంతో చనువుగా ఉన్న అమ్మాయి ఒక్కసారిగా ప్రేమించలేదని చెప్పడంతో అబ్బాయి షాక్ కు గురై.. . ఇంట్లో ఉంటున్న తన ప్రియురాలు ఆమె తల్లి కారణంగా ఇలా మాట్లాడిందని, నా జీవితంలో ఆమె పెద్ద విలన్ అని ,కొంతకాలం నుంచి మహిళా పారిశ్రామికవేత్తకు ఫోన్ చేస్తున్న ఆమె కుమార్తె స్నేహితుడు అసభ్యంగా మాట్లాడటం, రొమాన్స్, రాసలీలల డైలాగులు చెప్పడంతో ఆమె షాక్ కు గురైనారు. ఏదో రాంగ్ నెంబర్ అని ఆమె కొన్నిసార్లు పట్టించుకోలేదు. చివరికి పదేపదే అలాంటి ఫోన్లు రావడంతో ఆమె అసహనంతో రగిలిపోయింది. ఇదే సమయంలో మీ ఫోటోలు, మీ శరీర అందం, వంపులు, చుట్టుకొలతలు చాలా బాగున్నాయని, ఆ ఫోటోలు నేను సోషల్ మీడియాలో చూశానని ఆ యువకుడు స్నేహితురాలి తల్లితో అసభ్యంగా మాట్లాడాడు.

 ఎవరో తన పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్స్ తో మార్ఫింగ్ ఫోటోలు పోస్టు చేస్తున్నారని, గుర్తు తెలియన వ్యక్తి ఫోన్ లో అసభ్యంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నాడని మహిళా పారిశ్రామికవేత్త చెన్నై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చెన్నై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియాలోని నకిలీ ఐపీ అడ్రస్ ల ఆధారంగా విచారణ చేశారు. అదే సమయంలో చెన్నైలోని తౌజండ్స్ లైట్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలుడు మహిళా పారిశ్రామికవేత్త ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో అతన్ని అరెస్టు చేశారు. తన ప్రియురాలు దూరం కావడానికి ఆమె తల్లి   కారణం అయ్యారని, అందుకే పగతో ఇలా చేశానని ఆ కాలేజ్ అబ్బాయి నేరం అంగీకరించాడు.  దీనితో అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కి తరలించారు.
Tags:    

Similar News