దేశంలో కరోనా విస్తృతంగా ప్రబలుతోంది. ప్రముఖులందరికీ ఇది సోకుతోంది. రోజురోజుకు ఎక్కువవుతోంది. సీఎంలు, మంత్రులు, మాజీ సీఎంలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ లు , ఐపీఎస్ లు, వైద్యులు ఇలా చాలా వీఐపీలు కరోనా బారిన పడుతున్నారు.
తాజాగా మైనింగ్ కింగ్, మాజీ మంత్రి , ప్రముఖ రాజకీయ నేత అయిన గాలి జనార్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా లక్షణాలు లేకపోయినా వైరస్ పాజిటివ్ గా తేలిందని.. వైద్యుల సలహా మేరకు చికిత్స చేయించుకుంటున్నారని మాజీ మంత్రి స్పష్టం చేశారు.
కర్ణాటకతోపాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలి జనార్ధన్ రెడ్డికి అభిమానులు, అనుచరులు ఉన్నారు. కర్ణాటకతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల్లో గాలి జనార్ధన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయాల్లోకి రాకముందే గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కర్ణాటక మంత్రిగా పనిచేశారు.
గాలికి కరోనా అని తెలియగానే.. ఆయన ప్రాణమిత్రుడు.. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు పరామర్శించారు.