బ్రేకింగ్ : కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ కి కరోనా పాజిటివ్ !

Update: 2020-09-17 07:30 GMT
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌  కరోనా బారినపడ్డారు. అనారోగ్యంతో వైద్యుడిని సంప్రదించి టెస్ట్‌ చేసుకోగా పాజిటివ్ అని తేలిందని నితిన్ గడ్కరీనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ప్రస్తుతం తాను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. నీరసంగా అనిపించడంతో వైద్యుడిని సంప్రదించానని, ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలిందని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. అలాగే ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని , ఎవరికైనా లక్షణాలు ఉంటే నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని  తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఇకపోతే , చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజు రోజుకు రికార్డుస్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది.  తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. అలాగే , నిన్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి కూడా పాజిటివ్ గా వచ్చింది. ఇకపోతే , ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు సుమారు ఏడుగురు కేంద్ర మంత్రులు, 20 మందికి పైగా మంది పార్లమెంటు సభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారు.
Tags:    

Similar News