భారతదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సెకండ్ వేవ్ ప్రభావంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల పట్ల వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు స్పందించాయి. ఇప్పటికే పలు దేశాలు, సంస్థలు తమ వంతు సాయాన్ని ప్రకటించాయి. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం భూరి విరాళం ప్రకటించింది.
సామాజిక మధ్యమ రారాజు ట్విట్టర్ భారత్ పట్ల పెద్ద మనసు చూపింది. దేశంలో రెండో దశ కారణంగా తమవంతుగా సాయం చేసి ఆపన్న హస్తం చాటింది. కరోనా సంక్షోభం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ రూ.15మిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించింది. కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ అనే స్వచ్ఛంద సంస్థల ద్వారా సాయం చేయనున్నట్లు ట్విట్టర్ సీఈవో ప్యాట్రిక్ జోర్సె ట్వీట్ చేశారు.
కేర్ ద్వారా పది మిలియన్లు, మిగతా రెండు సంస్థలు చెరో రెండున్నర మిలియన్లు అందించనున్నామని ప్రకటించింది. సేవా ఇంటర్నేషనల్ ఓ లాభాపేక్ష లేని హిందూ విశ్వాస స్వంచ్ఛంద సంస్థ అని, ఈ కరోనా విపత్కర కాలంలో భారత్ కు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ సంక్షోభ కాలంలో అత్యవసరమైన ఆక్సిజన్, వెంటిలేటర్లు, వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు వంటి వాటికి ఈ సాయాన్ని ఉపయోగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు అందజేస్తామని వివరించారు.
ఈ విరాళంతో ఫ్రంట్ లైన్ వర్కర్లకు అవసరమైన సామాగ్రి, టీకాలు వంటివి సమకూర్చుతామని వెల్లడించారు. తాత్కాలిక కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విపత్కర కాలంలో భారతీయులను ఆదుకోవడానికి గూగుల్, మెక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు ఇప్పటికే తమవంతు సాయాన్ని ప్రకటించాయి.