క‌రోనా చావులు మార్చురీ నిండిపోయి నేల‌పైనే!

Update: 2021-04-04 02:30 GMT
క‌రోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయం అంతకంత‌కూ పెరుగుతోంది. దేశ‌వ్యాప్తంగా కేసులు తీవ్ర‌స్థాయిలో పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం ఏప్రిల్ ఒక‌టో తేదీన ఏకంగా.. 81,466 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇంత భారీగా కేసులు న‌మోదు అవుతుండ‌డంతో ప్ర‌జ‌లతోపాటు ప్ర‌భుత్వాలు కూడా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

ఇక‌, కొవిడ్ ధాటికి ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రంలో శ‌వాల గుట్ట‌లు పేరుకుపోతున్నాయి. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే దాదాపు 6 వేల మందికిపైగా ఆసుప‌త్రిపాల‌య్యారు. వీరిలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ ఆసుప‌త్రిలో శ‌వాల‌ను భ‌ద్ర‌ప‌రిచే ఫ్రీజ‌ర్లు నిండిపోవ‌డంతో మృత‌దేహాల‌ను నేల‌పైనే ప‌డుకోబెట్టార‌ట‌.

మ‌రోవైపు.. ఆసుప‌త్రుల‌కు వ‌స్తున్న రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంద‌ని స‌మాచారం. వైద్య సిబ్బంది స‌రిపడా లేక‌పోవ‌డంతో రోగులు అల్లాడిపోతున్న‌న్నారు. ఛ‌త్తీస్ గ‌ఢ్ లో మార్చి 20వ తేదీనాటికి 6,753 కేసులు ఉండ‌గా.. ఏప్రిల్ 2 నాటికే ఆ సంఖ్య ఏకంగా 28,987కు చేర‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. దీంతో.. .జ‌నాలు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.
Tags:    

Similar News