రెండు తెలుగు రాష్ట్రాల్ని ఒక ఊపు ఊపేసిన కరోనా.. కొద్ది కాలంగా కొత్త కేసుల నమోదు నెమ్మదించటం తెలిసిందే. ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల్లోనూ స్కూళ్లు తెరవటం.. మిగిలిన కార్యకలపాల్లో వేగవంతం కావటం లాంటి పరిణామాలు ఇప్పుడు కొత్త కేసుల నమోదును పెంచేలా చేస్తున్నాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కొత్త కేసుల్లో ఎక్కువగా స్కూళ్ల చుట్టూ తిరగటం గమనార్హం. మంగళవారం వెల్లడైన వివరాల ప్రకారం తెలంగాణలో 204 కొత్త కేసులు అయితే.. స్కూళ్లలో భారీగా నమోదవుతున్న వైనం వెలుగు చూస్తోంది.
మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలానికి చెందిన మైనార్టీ గురుకుల పాఠశాలను నాగోలు బండ్లగూడలో ఏర్పాటు చేశారు. ఇక్కడ 165 మంది విద్యార్థులు ఉంటే.. వారిలో 25 మంది విద్యార్థులకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేస్తే.. 18 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మిగిలిన విద్యార్థులకు.. సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా.. మరో 18 కేసులు కొత్తగా గుర్తించారు. దీంతో.. ఒక్కసారిగా ఉలికిపాటుతో పాటు.. కొత్త టెన్షన్ మొదలైంది.
ఇప్పటికే మంచిర్యాలలోని బాలిక పాఠశాలలో 28 కరోనా కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగించటంతో.. ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరంలో 174 మందికి పరీక్షలు నిర్వహిస్తే 34 పాజిటివ్ లు బయటకు వచ్చాయి. ఇందులో 28 మంది విద్యార్థినులే కావటం గమనార్హం. అంతేకాదు.. కామారెడ్డి సమీపంలోని ఒక స్కూల్లో 32 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లుగా గుర్తించారు. కరీంనగర్ లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు.. ఒక ఉపాద్యాయుడికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ లోని న్యూబోయినపల్లి లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గ్రహంలో ముగ్గురు విద్యార్థులు కరోనా బారిన పడినట్లుగా తేలింది. ఇలా స్కూళ్లలో కరోనా కేసులు పెద్ద ఎత్తున బయటపడటిపోవటంతో కొత్తఆందోళన వ్యక్తమవుతోంది.
తెలంగాణలోని పరిస్థితికి తగ్గట్లే ఏపీలోనూ ఇలాంటి సీనే కనిపిస్తోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా 261 మందికికొత్తగా కరోనా సోకినట్లు గుర్తించారు. కొత్తగా కరోనా తేలిన వారిలో విద్యార్థులు.. స్కూల్ సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. దీంతో.. స్కూళ్లను తెరిచి.. కొత్త కేసుల పెరుగుదలకు కారణమైందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.