కరోనా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తి చెందడానికి ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది తుంపర్లు. వైరస్ సంక్రమించిన వ్యక్తి, తుమ్మినా,దగ్గినా ఆ తుంపర్లు సుమారు రెండు మీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఇక రెండవది ఏరోసోల్స్. ఏరోసోల్స్ అంటే అతిసూక్ష్మ తుంపర్లు. ఈ ఏరోసోల్స్ గాలిలో సుమారు పది మీటర్లు ప్రయాణిస్తాయని నేడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీసు తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. పాజిటివ్ వ్యక్తి నుంచి రిలీజైన తుంపర్లు ఏదైనా వస్తువుపై పడినా, ఆ సర్ఫేస్ పై వైరస్ సజీవంగా కొంత సమయం ఉంటుంది , ఇది మూడవ మార్గం. అయితే పెద్ద సైజులో ఉండే తుంపర్లు సాధారణంగా కింద పడిపోతాయి. కానీ చిన్న సైజులో ఉండే ఏరోసోల్స్ మాత్రం చాలా దూరమే ప్రయాణిస్తాయి. అవి కనీసం పది మీటర్ల దూరం ప్రయాణిస్తాయని ప్రభుత్వ సైంటిఫిక్ అడ్వైజర్ స్పష్టం చేశారు.
దీని వల్ల ఎక్కువ శాతం వైరస్ సంక్రమించే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. ఒకవేళ మీరు ఇండోర్ స్పేస్ లో ఉన్నట్లు అయితే ఆ ప్రమాదం మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే చాలా త్వరగా ఆ ప్రాంతాల్లో వైరస్ లోడ్ అధికం అవుతుంది. దీని వల్ల వ్యాప్తి కూడా ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. ఔట్ డోర్ ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తి ప్రభావం తక్కువగా ఉంటుందని, ఎందుకంటే వైరస్ కణాలు చాలా త్వరగా గాలి ద్వారా కొట్టుకుపోతాయని అడ్వైజరీ చెప్పింది. వైరస్ సంక్రమిత వ్యక్తి నుంచి వెలుబడిన తుంపర్లు వేర్వేరు ప్రదేశాల్లో.. వేర్వేరు వస్తువులపై పడుతుంటాయి. అయితే కలుషితమైన ఆ ప్రదేశాలను ఎవరైనా ముట్టుకుని.. చేతులను శానిటైజ్ చేసుకోకుండా.. నోట్లో కానీ, కంట్లో కానీ, ముక్కులో కానీ పెట్టుకుంటే, దాని ద్వారా వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్లాస్, ప్లాస్టిక్, స్టీల్ లాంటి వస్తువులపై.. వైరస్ ఎక్కువ కాలం జీవిస్తుందని సైంటిఫిక్ అడ్వైజరీ చెప్తుంది.
కరోనా కట్టడిలో మాస్క్ కీలకం. రెండు మాస్క్‌లతో మరింత ప్రయోజనం అంటున్నారు నిపుణులు. సర్జికల్ మాస్క్‌తో పాటు కాటన్ మాస్క్ కలిపి పెట్టుకోవాలి. ఎన్ 95 మాస్క్ వాడటం శ్రేయస్కరం. భారతదేశంలో ఇప్పటి వరకు కనీసం 2.57 కోట్ల మంది ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2.87 లక్షల మంది మరణానికి దారితీసింది. డోర్ హ్యాండిళ్లు, లైట్ స్విచ్‌లు, టేబుళ్లు, చైర్లు, ఫ్లోర్‌ను ఎప్పటికప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రం చేయాలన్నది. బ్లీచింగ్, ఫినాయిల్ లాంటి వాటిని కూడా క్లీనింగ్ కోసం వాడవచ్చు. సరైన వెంటిలేషన్ ఉంటే.. ఈ సమస్యలన్నీ తప్పించుకోవచ్చు అని సైంటిఫిక్ అడ్వైజరీ ఆఫీసు తన మార్గదర్శకాల్లో చెప్పింది.