కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 300కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇక తెలంగాణలో అయితే ఇప్పటికే 11 మంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోగా - తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 400 కి చేరువలో ఉంది. ఇక ప్రజాప్రతినిధులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకుంటున్నారు.
తాజాగా ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల ఆయన కలిసిన ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లోకి వెళ్లారు. తన రక్త నమూన సేకరించి వైద్యులు పరీక్షించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో కార్యకర్తలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 5న నెల్లూరుకు చెందిన ఓ వైద్యునికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆయన తన ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంత్రి అనిల్‌ను కూడా ఆహ్వానించారు.
ఈ క్రమంలో అతనితో దగ్గరగా కాంటాక్ట్ అయిన వారిలో ఆందోళన మొదలైంది. మంత్రి కూడా ముందు జాగ్రత్తగా రెండు రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఆదివారం తన రక్త నమూన పంపించగా.. నెగిటివ్ అని తేలింది. కరోనా నెగటివ్ అని తేలడంతో మంత్రి అనిల్ కుమార్ ఇక కరోనావైరస్ కార్యక్రమాలపై తిరగాలని డిసైడ్ అయ్యారు. ప్రజల్లో అవగాహన తీసుకురావాలని నిర్ణయించుకుని ఈ రోజు ఇంటి నుంచి బయటకు అడుగుపెడుతున్నట్లు సమాచారం. ఇకపోతే , నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.