ప్రతి ఒక్కరికి కరోనా టెస్ట్..ఏపీలో రోడ్డెక్కిన సంజీవని బస్సులు!

Update: 2020-07-09 17:30 GMT
ఏపీ ప్రభుత్వం కరోనా పై పట్టు వదలకుండా దాన్ని అంతమొందించడానికి రకరకాల అస్త్రాలతో ముందుకుపోతుంది. ఇప్పటికే కరోనా నిర్దారణ పరీక్షల్లో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన ఏపీ ... తాజాగా కరోనా పోరులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య పెంచడానికి ప్రభుత్వం కరోనా ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది.

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణను దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను రూపొందించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు ఆర్టీసీకి చెందిన 52 బస్సులను తీసుకుని వాటిని కరోనా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ గా మార్చుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 30 బస్సులను కరోనా టెస్టులు చేయడానికి అంతా సిద్ధం చేసి అన్ని జిల్లాలకు పంపించారు. మిగిలిన బస్సులను కూడా త్వరలోనే పూర్తిగా సిద్ధం చేసి జిల్లాలకు పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బస్సులకు సంజీవని బస్సులని పేరుపెట్టింది. ఈ బస్సుల ద్వారా ప్రతి సామాన్యుడికి కరోనా టెస్ట్ ఉచితంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇకపోతే ఏపీలో 10 లక్షల 94 వేల 615 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.



Tags:    

Similar News