కరోనా మహమ్మారి అనేకమంది జీవితాలను అతలాకుతలం చేసింది. చాలా మందిని కోలుకోలేని దెబ్బతీసింది. వైరస్ వ్యాప్తి చెందుతున్న తొలి రోజుల్లో ముందస్తు జాగ్రత్తల కారణంగా దేశంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ ను కేంద్రం విధించింది. దీంతో బుడుగు, బలహీన వర్గాల వారితో పాటు చాలా మంది ఉద్యోగులు కూడా రోడ్డున పడ్డారు. మరికొంత మంది వలస కార్మికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. రాకపోకలు స్తంభించి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వయసు పరంగా చూసుకుంటే కరోనా ప్రభావం అందరి మీదా ఉంది. అయితే 18 ఏళ్ల నుంచి 24 వరకు ఉండే వారిపై మరింత ఎక్కువగా ఉందని ఇటీవల చేపట్టిన ఓ సర్వేలో తేలింది. వృత్తిపరంగా ఆ వయసు వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. ఆర్థికంగా కూడా వీరు చాలా నష్టపోయినట్లు స్పష్టమైంది. ముసలి వయసు వారితో పోల్చితే వీరికి వచ్చే ఆదాయానికి భారీగా గండిపడినట్లు సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో భాగమైన సుమారు 80 శాతం మంది వృత్తిగత జీవితంపై కరోనా ప్రభావం భారీగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సర్వే నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో సుమారు 17 దేశాలకు చెందిన వివిధ వృత్తుల వారు 32 వేలకు పైగా ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరు అందరూ ఏకదాటిగా చెప్పిన విషయం ఏమిటంటే.. కరోనా కారణంగా వీరు ఆర్థికంగా బాగా నష్టపోవడం. ఈ వయసులో ఉండే వారిలో ఎక్కువ మంది కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయినట్లు చాలామంది పేర్కొన్నారు.
సుమారు ప్రతీ ఐదు మంది కార్మికుల్లో ఇద్దరకు పైగా నిరుద్యోగులు అయినట్లు సర్వే స్పష్టం చేసింది. వీరిలో కొంతమంది తాత్కాలికంగా ఉద్యోగం కోల్పోతే... మరికొంత మంది వారు పని చేస్తున్నా కంపెనీ నుంచి శాశ్వతంగా తొలగించబడినట్లు నివేదిక స్పష్టం చేసింది. వయసుతో సంబంధం లేకుండా ఉద్యోగం చేసే వారు కూడా కరోనా కాలంలో నిరుద్యోగాన్ని ఎదుర్కొన్నారు. ఇలాంటి వారిలో మొత్తంగా చూసుకుంటే దాదాపు 30 శాతం వరకు నిరుద్యోగులు అయినట్లు సర్వే పేర్కొంది. మన దేశం విషయానికి వస్తే.. ఉద్యోగం చేసే వారిలో సగం మందికి పైగా తాము చేస్తున్న జాబ్ ను కోల్పోతారు ఏమో అని ఆందోళనకు గురైనట్లు తేలింది. ఇదే సమయంలో ఉద్యోగం కోల్పోయిన వారు ఎక్కువ మంది స్వతంత్రంగా బతికేందకు గానూ వ్యాపార అలోచనలు చేసినట్లు స్పష్టమైంది.
ఏదేమైనా ప్రపంచ వ్యాప్తంగా కరోనా చాలా మంది జీవితాల్లో కన్నీళ్లను మిగిల్చినట్లు స్పష్టమైంది. కేవలం ఉద్యోగులు మాత్రమే గాక చేతి వృత్తుల వారు, వ్యాపారస్థులు, మెకానిక్ లు.. ఇలా చెప్పుకుంటే చాలా మందిపై వైరస్ ప్రభావం పడినట్లు వివిధ సర్వేలు వెల్లడించాయి. కొన్ని దేశాలు ఇప్పటికే ఆర్థికంగా నిలదొక్కుకుంటే మరికొన్ని దేశాలు ఇంకా కొట్టిమిట్టాడుతున్నాయి.