తెలంగాణలో కరోనా విశృంఖలంగా వ్యాపిస్తోంది. ఊహకందని రీతిలో విస్తరిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా తేలింది. వారి కాంటాక్టులకు కూడా ఇప్పుడు సోకుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, సహాయకులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డితోపాటు ఆయన భార్యకు, వంటమనిషికి, గన్ మెన్ లకి కూడా కరోనా సోకింది. తాజాగా మరో గులాబీ పార్టీకి చెంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో బాజిరెడ్డికి కరోనా పాజిటివ్ రాగా.. ఆయన భార్యకు నెగెటివ్ వచ్చింది. తాజాగా బుధవారం పరీక్ష చేయగా.. పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమెను ఎమ్మెల్యేతోపాటు హైదరాబాద్ లో ఐసోలేషన్ లో ఉంచారు.
తెలంగాణలో నిన్న ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 352 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6వేలు దాటింది.