కరోనా మరణ మృదంగం: అమెరికాలో ఒక్కరోజే 1973మంది మృతి

Update: 2020-04-09 03:52 GMT
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. వైరస్ ధాటికి అమెరికాలో పరిస్థితి భయానకంగా తయారైంది. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.  తాజాగా కరోనా మరణాల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఎంత ప్రయత్నించినా కరోనా మరణాలకు అమెరికా అడ్డుకట్ట వేయలేకపోతోంది.

*బుధవారం ఒక్కరోజే 1973 మంది మృతి
బుధవారం ఒక్కరోజే అమెరికా లో 1973 మంది మరణించారు. అంతకుముందు రోజు మంగళవారం ఏకంగా 1858మంది మరణించారు. మరణాలు రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.  ఈసారి కూడా అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లోనే 779 మంది మరణించడం కలకలం రేపింది.

అమెరికాలో బుధవారం వరకూ 6268మంది మరణించగా.. 1,51,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లోనే కరోనా వైరస్ విస్తృతి ఎక్కువగా ఉంది.

న్యూజెర్సీలో ఇప్పటిదాకా 3021 మరణాలు, 47437 కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు.

మొత్తం మీద అమెరికా లో పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,062 కేసులు దాటాయి. ఏ దేశంలోనూ ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. బుధవారం ఒక్కరోజే ఏకంగా 34వేల కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.


Tags:    

Similar News