ప్రస్తుతం ప్రపంచంలోనే కరోనా వైరస్‌తో అత్యంత విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న దేశం అమెరికా. ఆ దేశంలో ఏకంగా ఆరు లక్షలకు కరోనా కేసులు చేరాయి. మృతుల సంఖ్య 20 వేలకు పైగా చేరింది. ఇంకా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంపే అంగీకరించాడు. లక్షకు పైగా కరోనా మృతులు పెరుగుతారని, పది లక్షలకు పైగా కరోనా బాధితులు పెరుగుతారని సంచలన ప్రకటన చేశాడు. అయితే కరోనా కట్టడి కోసం ఆయన మాత్రం చర్యలు చేపట్టడంలో విఫలమయ్యాడని అంతర్జాతీయ సంస్థలతో పాటు అమెరికా ప్రజలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు విమర్శిస్తున్నారు. ఇదే విషయాన్ని అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన న్యూయార్క్ టైమ్స్ కూడా వెల్లడిచింది. ఈ సందర్భంగా ప్రచురితమైన కథనం అమెరికాలో సంచలనంగా మారింది.
అమెరికాలో కరోనా పెట్రేగిపోవడానికి కారణం అధ్యక్షుల వారి అసమర్థతేనని స్పష్టం చేసింది. వైరస్ ప్రారంభంలోనే తీవ్రతను అమెరికా నిఘా విభాగంతోపాటు జాతీయ భద్రత వర్గాలు, ప్రభుత్వ ఆరోగ్య అధికారులతో పాటు అన్ని కేబినెట్ విభాగాలు తీసుకోవాల్సిన చర్యల గురించి ట్రంప్ ను హెచ్చరించినా అధ్యక్షుడు ట్రంప్ నిర్లక్ష్యం చేశాడని, వారి హెచ్చరికలను ట్రంప్ బేఖాతర్ చేయడంతోనే ప్రస్తుతం ఈ పరిస్థితికి దారి తీసిందని ఆ కథనంలో తెలిపింది. కరోనా కట్టడి కోసం పటిష్ట వ్యూహం లేకపోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం చెందడంతోనే ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తోందని వెల్లడించింది. జనవరి మొదట్లోనే చైనాలోని వూహాన్‌లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ముందే వైట్‌హౌస్‌కు సమాచారం వచ్చిందని తెలిపింది. తీవ్రతను అంచనా వేసే బాధ్యతల్ని జాతీయ భద్రతా కౌన్సిల్‌లోని బయో డిఫెన్స్ వర్గాలకు అప్పగించడంతోనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా ఉన్న మూడు వారాల విలువైన సమయాన్ని ట్రంప్ వృథా చేశారని, అందుకే ప్రస్తుతం దేశంలో ఇంతటి విపత్కర పరిస్థితి ఏర్పడిందని కథనంలో పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడి ముఖ్య వాణిజ్య సలహాదారు పీటర్ నవారో జనవరి చివరి వారంలో అధ్యక్షుడు ట్రంప్‌నకు కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత, నష్టాలను వివరిస్తూ ఒక లేఖ రాయగా ట్రంప్ పట్టించుకోలేదట. ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ట్రంప్ తన బృందంలోని ప్రజారోగ్య సలహాదారుడిని పక్కనపెట్టి ఉపాధ్యక్షుడు మైక్ పొంపియాకు ఆ బాధ్యతలు అప్పగించడం కూడా పరిస్థితి చేయి దాటిపోవడానికి కారణంగా కథనంలో చెప్పింది. వైరస్ కట్టడి విషయంలో వైట్ హౌస్ లో రెండు వర్గాలు చీలిపోయిందని పేర్కొంది.
న్యూయార్క్ మహానగరంలో కరోనా తీవ్ర రూపం దాల్చిన దానిపై ఆ కథనంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. కరోనాతో అమెరికాలో సంభవించిన మరణాల్లో సగం న్యూయార్క్ ప్రాంతానికి చెందినవే. అమెరికాలో కరోనా కేసులు 5.33 లక్షలు ఉండగా, ఒక్క న్యూయార్క్‌లోనే 1.8 లక్షలుగా ఉండటం, అమెరికాలో 20 వేల మంది మరణిస్తే, వాటిలో 8,600 మంది న్యూయార్క్‌కు చెందిన వారే ఉండడం ప్రస్తుతం ఆ నగరంలో నెలకొన్ని పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించింది.
ఆ పరిస్థితికి కారణం ప్రజలు సహకరించకపోవడం, ప్రభుత్వాల నిర్లక్ష్యం తదితర అన్ని కలిసి ప్రస్తుతం న్యూయార్క్‌ల కరోనా కల్లోలానికి కారణంగా మారారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఈ విధంగా నూయార్క్ టైమ్స్ తమ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ వైఖరే కారణమని స్పష్టంగా తెలిపింది. ఈ వైరస్ కట్టడిలో ట్రంప్ విఫలమయ్యారని నేరుగా విమర్శలు చేసింది. దీంతో అమెరికాలో ఈ కథనం సంచలనంగా మారింది.