కాలే కడుపును నింపుకోవటానికి రాష్ట్రం కాని రాష్ట్రానికి వెళ్లిన వారిని తక్కువ చేయటం ఉద్దేశం ఎంతమాత్రం లేదు. ఊరి కాని ఊళ్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరేడు వారాలు ఉండటమంటే మామూలు విషయం కాదు. అందునా మధ్యతరగతి జీవికి ఉండే తిప్పలు అన్నిఇన్ని కావు. కేంద్రం ఇచ్చిన తాజా ఆదేశాల నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయిన వలసకూలీలు.. కార్మికులు వారి సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది. వారితో పాటు యాత్రికులకు.. విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చింది.
వలసకూలీల తిప్పలు అందరికి తెలిసినవే. కానీ.. ఇతర పనుల మీద వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మధ్యతరగతి.. దిగువ మధ్యతరగతితో పాటు.. ఎగువ మధ్యతరగతి వారు పడుతున్న బాధలు.. కష్టాలు అన్నిఇన్ని కావు. పేదవారిని కనీసం పట్టించుకునే ప్రభుత్వం.. మీడియా.. మధ్యతరగతి జీవుల కష్టాల్ని ఏ మాత్రం పట్టించుకోదు. వారి గురించిన కథనాలు ఏ మీడియాలోనూ రావు.
వ్యాపార పనుల మీదనో.. బంధువులు మరణించిన కారణంగానో.. ఇతర పనుల మీదనో.. ఇంకేదో కారణాలతోనో చిక్కుకుపోయిన వారికి ఇప్పటికే చుక్కలు కనిపిస్తున్నాయి. సొంతూళ్లకు పోయేందుకు వారికి అవకాశం లేకపోవటం.. ఉన్న చోట ఉండలేకపోవటంతో వారి పరిస్థితి త్రిశంక స్వర్గంగా మారిపోయింది. ఇప్పటికే ఆరేడు వారాలు పూర్తి అయి.. రానున్న రోజుల్లో మరెన్ని రోజులు లాక్ డౌన్ కొనసాగుతుందో తెలీని వేళ.. ఊరికి వెళ్లేదెలా? అన్నది పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి వేళ.. ఏపీ సర్కారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకు పోయిన తమ వారిని రాష్ట్రంలోకి అనుమతిచ్చేది లేదని మొండిపట్టు పట్టటాన్ని తప్పు పడుతున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వచ్చేస్తున్న ఆంధ్రోళ్లను అడ్డుకోవటం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో లాక్ డౌన్ మరెన్ని రోజులు పడుతుందన్న దానిపై ఇప్పటికి క్లారిటీ లేని పరిస్థితి. ఇలాంటివేళ.. ఇంటికి వెళ్లేందుకు నానా తిప్పలు పడి రాష్ట్ర సరిహద్దుల వరకూ చేరిన వారిని.. రాష్ట్రంలోపలకు రానిచ్చేది లేదంటూ ఏపీ అధికారులు ససేమిరా అనటం సరైన పద్దతి కాదంటున్నారు.
క్వారంటైన్ ఉంచటం కుదరదనుకుంటే.. కఠినమైన హోం క్వారంటైన్ కు ఓకే అంటే తప్ప రానిచ్చేది లేదన్న మాటను చెప్పినా బాగుంటుందంటున్నారు. ఈ విషయంలో ఏపీ సర్కారు పెద్ద మనసు చేసుకోవాలన్న వేడుకలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరి.. ఏపీ సర్కారు మనసు మారుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.