కరోనా వైరస్ రాకుండా ఉండేదుకు ... ఎలాంటి పద్ధతులు అవలంభిస్తున్నారంటే ...

Update: 2020-03-02 05:46 GMT
కోవిడ్ 19 (కరోనా వైరస్) ...ఈ ప్రాణాంతకరమైన వైరస్ చైనాలోని వూహన్ సిటీలో పుట్టి ప్రస్తుతం 66 దేశాలకి విస్తరించి ..మొత్తం ప్రపంచాన్నే వణికించేస్తుంది. ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే సుమారుగా 2400 మందికి పైగా మరణించారు. అలాగే 90 వేల మందికి పైగా ఈ వైరస్ ప్రభావంతో భాదపడుతున్నారు. ఇకపోతే ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (Covid 19)కి ఇప్పటివరకూ మందు ఇంకా కని పెట్టలేదు. . అలాగే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి.

దీనితో ఒకరి నుండి మరొకరికి వైరస్ సోకకుండా ఉండేందుకు వివిధ దేశాల ప్రజలు .. పలు విచిత్ర విధానాలని పాటిస్తున్నారు. ముఖ్యంగా చాలామంది ఈ వైరస్ భారిన పడకుండా ఉండేందుకు .. మాస్కులు వాడుతున్నారు. ఐతే... మాస్కులు వాడటం వల్ల ముక్కు, నోటి ద్వారా బాడీలోకి వైరస్ వెళ్లకపోవచ్చేమోగానీ... కళ్ల నుంచీ వెళ్లే ప్రమాదం కూడా ఉంది. దీనితో మరికొంతమంది శరీరమంతటికీ టెంటు వేసుకుని బయటకి వస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ లోకి ఎప్పుడు రావాలన్న కూడా బాడీకి మొత్తం కవర్స్ తో కప్పుకొని బయటకి వస్తున్నారు. మరి కొందరు ప్రతిక్షణం హెల్మెట్ ధరిస్తున్నారు. ఇలా విచిత్రమైన రీతుల్లో జనం మధ్య సంచరిస్తున్నారు. కాగా , కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా లో అనేక పుకార్లు వైరల్ అవుతున్నాయి. వైరస్ కు సంబంధించి తప్పుడు సమాచారం సోషల్ ప్లాట్ ఫాంల్లో ఎక్కువ గా వైరల్ అవుతున్నాయి.
Tags:    

Similar News