పల్లె వాసులపై పడగ విప్పిన కరోనా!

Update: 2021-06-04 07:38 GMT
పల్లె వాసులపై పడగ విప్పిన కరోనా!
పైరు గాలి , పచ్చని చెట్లతో మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి పల్లెలు. చుట్టూ పొలాలు, వాటిని సాగుచేసుకునే రైతన్నల కుటుంబాలతో కళకళలాడుతుంటాయి. పొరుగు వారిని మామ, అత్త, బాబాయ్, పిన్ని ఇలా ఆప్యాయంగా పలిచే పిలుపులకు వేదిక. కరోనా దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని మహానగరాల నుంచి చిన్న చిన్న నగరాల వరకు, పెద్ద పంచాయితీల నుంచి చిన్న వరకు ఎక్కడ చుసిన మహమ్మారి ప్రజలను పీడించడం మాత్రం సెకండ్ వేవ్ లో సర్వ సాధారణం అయిపోయింది. కరోనా వైరస్  రాకుండా కొన్ని గ్రామాలూ రోడ్డుని త్రవేసిన, మూళ్ళ కంపలు వేసిన కరోనా ఎంట్రీ మాత్రం ఆగలేదు.

అయితే , క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని కుదిపేస్తున్న‌ది.  మొద‌టి వేవ్ ప్ర‌భావం న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలై అధికంగా ఉండ‌గా, సెకండ్ వేవ్ ప్ర‌భావం గ్రామాలు, ప‌ల్లేల‌పై ఉన్న‌ది.  దీంతో గ్రామాల్లోని ప్ర‌జ‌లు ఆంధోళ‌న చెందుతున్నారు.  బ‌య‌ట‌కు రావాలంటే ఆలోచిస్తున్నారు.  మొదటి వేవ్ స‌మ‌యంలో న‌గ‌రాలకు వ‌ల‌స వెళ్లిన కూలీలు క‌రోనా కార‌ణంగా తిరిగి ప‌ల్లేబాట ప‌ట్టారు.  న‌గ‌రాల నుంచి ప‌ల్లెల‌కు చేరుకోవ‌డంతో మెల్లిగా గ్రామాల్లో క‌రోనా విస్త‌రించ‌డం మొదలైంది.  గ్రామాల్లో వైద్య‌సేవ‌లు ఎంత‌వ‌ర‌కు అందుబాటులో ఉంటాయో అంద‌రికి తెలిసిందే.  ఒకసారి క‌రోనా గ్రామంలో వ్యాపించ‌డం మొద‌లుపెడితే దానిని అడ్డుకోవ‌డం క‌ష్టం అవుతుంద‌ని వైద్య‌నిపుణులు గ‌తంలో ప‌లుమార్లు తెలియ‌జేశారు.  సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గ్రామాల‌పైనే అధికంగా ఉండ‌టంతో అధికారులు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  గ్రామాల్లోని ప్ర‌జ‌లు కూడా అప్ర‌మ‌త్తం కావ‌డంతో క‌రోనాను కొంత‌మేర అడ్డుకున్నారని చెప్పొచ్చు.  ఆ పల్లెలోని కట్టుబాట్లే పల్లె వాసులకు శ్రీరామా రక్షగా మారింది. పెద్దలు చెప్పిన మాటను జవదాటని ఆ పల్లె వాసులు కరోనా రహిత గ్రామంగా తీర్చి దిద్దుకొని కొన్ని జిల్లాలు ఆదర్శనంగా మారుతున్నారు. 
Tags:    

Similar News