ఏ జాబితాలోనూ భార‌త్‌ కు ద‌క్క‌ని చోటు

Update: 2020-04-01 19:30 GMT
క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తుండ‌గా దాని బారిన ప‌డి ప్ర‌భావిత‌మ‌వుతున్న దేశాలు చాలానే ఉన్నాయి. మొత్తం ప్ర‌పంచ‌మంతా ఈ వైర‌స్ పాకిన కొన్ని దేశాలు మాత్రం తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాయి. దీని బారిన ప‌డిన దేశాలు ఎన్నో ఉన్నాయి.  ఈ క‌రోనాట క‌ట్ట‌డికి ఆ దేశాల్లో ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు, జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా ఆ వైర‌స్ అదుపులోకి రావ‌డం లేదు. వైర‌స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతుండ‌గా.. మృతుల సంఖ్య కూడా దారుణంగా ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌, సుర‌క్షిత‌మైన దేశాల‌పై విస్తృతంగా చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో అత్య‌ధిక కేసుల బారిన ప‌డిన దేశాల్లో అమెరికా, ఇట‌లీ, చైనా నిలిచాయి. ఈ విష‌య‌మై ప్ర‌ముఖ న్యూస్ నెట్‌వ‌ర్క్ సంస్థ సీఎన్ఎన్ ఆస‌క్తిక‌ర‌మైన వార్త వెలువ‌రించింది. ప్రజలు అత్యంత సురక్షితమైన, అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాను సీఎన్ఎన్ ప్రచురించింది.

ఆ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు అత్యంత ప్రమాదకర దేశాల్లో తొలి మూడు స్థానాల్లో ఇటలీ, ఇండొనేషియా, స్పెయిన్ నిలిచాయి. వాటి తర్వాత స్థానంలో ఇరాక్, ఇరాన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, యూఎస్ఏ (అమెరికా), యూకే, ఫిలిప్పీన్స్‌ దేశాలు ఉన్నాయి.

అయితే ప్ర‌జ‌ల‌కు అత్యంత సుర‌క్షిత‌మైన దేశాల్లో ఇజ్రాయిల్, సింగపూర్, స్లోవేకియా, న్యూజిలాండ్, హాంకాంగ్, తైవాన్, హంగేరి, ఆస్ట్రియా, జర్మనీ, గ్రీన్ ల్యాండ్‌లు నిలిచాయి. ఈ దేశాల్లో ప్ర‌జ‌లు అత్యంత సుర‌క్షితంగా ఉంటార‌ని ఆ సంస్థ కొన్ని నివేదికల ఆధారంగా తెలిపింది. దీంతో ఆ సంస్థ క‌రోనా నివార‌ణ‌లో, అత్యుత్త‌మ వైద్యం అందించే దేశాల జాబితాను కూడా విడుద‌ల చేసింది.

కరోనా బాధితుల‌కు నాణ్య‌మైన వైద్య సేవలు అందించే దేశాల జాబితాలో సింగపూర్, ద‌క్షిణ కొరియా, హాంకాంగ్, చైనా, జపాన్, జర్మనీ, ఆస్ట్రియా, యూఏఈ (అమెరికా), బెహరై, తైవాన్ దేశాలు ఉన్నాయి.

ఈ జాబితాలో ఎక్క‌డ కూడా భారతదేశానికి స్థానం ద‌క్క‌లేదు. ప్రమాదకర జాబితాలోనూ లేక‌పోవ‌డం హ‌ర్ష‌ణీయం కాగా సుర‌క్షిత‌మైన దేశాల్లో కూడా నిల‌వ‌ల‌క‌ పోవ‌డంతో ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. సురక్షితమైన దేశాల్లోనూ లేదంటే కొంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని అర్థం. దేశంలోకరోనా వైరస్ తీవ్ర‌మ‌వుతోంది. వేల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి.
Tags:    

Similar News