కరోనా కల్లోలం..తగ్గినా మళ్లీ తిరగబడుతోంది

Update: 2020-03-06 18:30 GMT
చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి అందరినీ వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తగ్గిపోతుందని భావిస్తుండగా మరో ఉపద్రవాన్ని తీసుకొచ్చింది. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న వారికి ఇది తిరగబడుతోంది. దీంతో ఈ వ్యాధి అంత సులువుగా తగ్గే రకం కాదని.. పదే పదే వస్తుందనే విషయం తాజాగా వెలుగుచూసింది.

జపాన్ ప్రభుత్వం తాజాగా ఈ సంచలన విషయాన్ని బయట పెట్టింది. ఒసాకాలోని కరోనా బారినపడ్డ ఓ మహిళ, పూర్తి స్థాయి చికిత్స పొంది కోలుకుంది. అయితే కొన్ని వారాల్లోనే ఆమెకు ఆ లక్షణాలు మళ్లీ కనిపించాయి. తాజాగా పరీక్షలు చేయిస్తే మళ్లీ కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

కాగా చైనాలోనూ ఇలాంటి కేసులు వెలుగుచూస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాయదారి రోగం తగ్గుతూ మళ్లీ వస్తుండడం తో ఎప్పుడు తగ్గుతుందనేది తెలియకుండా ఉంది. ప్రాణాలు పోయేదాకా ఈ వైరస్ చావదా అని అందరూ భయపడి పోతున్నారు.
Tags:    

Similar News