ప్రపంచాన్ని వణికించిన మాయదారి రోగం దేశానికి వచ్చింది కేరళ రాష్ట్రంలోనే. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తితో దేశంలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చూస్తున్నంతనే దేశంలో మరే రాష్ట్రంలో లేని కేసులన్ని కేరళలోనే నమోదు కావటం తెలిసిందే. దీంతో.. కళ్లు తెరిచిన ఆ రాష్ట్ర ప్రభుత్వం తన శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. తీవ్రమైన కట్టడి చర్యలతో పాటు.. వైరస్ వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు కఠిన నిర్ణయాల్ని తీసుకుంది.
దీంతో.. ఆశించిన దాని కంటే మిన్నగా కేరళలో పాజిటివ్ కేసుల నమోదు తగ్గిపోవటంతొ పాటు.. కొద్ది రోజులుగా ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. దీంతో.. ఊపిరి పీల్చుకోవటమే కాదు.. మాయదారి రోగాన్ని జాయించిన రాష్ట్రంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇలాంటివేళ.. ఆ రాష్ట్రంలో మరోసారి కలకలం రేగింది.
గడిచిన రెండు రోజుల్లో 36 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో కేరళ సర్కారుకు కొత్త కష్టం వచ్చినట్లైంది. మాయదారి వైరస్ ను కట్టడి చేయటంలో విజయం సాధించినట్లుగా భావించిన రాష్ట్రానికి.. తాజా పరిణామాలు కలకలాన్ని రేపుతున్నాయి. కొత్త కేసులు ఎక్కడ నుంచి వచ్చి ఉంటాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
దీనిపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. తాజాగా కేసులు నమోదు మొత్తం.. విదేశాల నుంచి.. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కారణంగానే తాజా కేసులు నమోదవుతున్నట్లుగా గుర్తించారు. కొత్తగా నమోదైన కేసుల్లో సగం మంది విదేశాల నుంచి.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితోనే అన్న విషయాన్ని వెల్లడించారు ముఖ్యమంత్రి విజయన్.
దేశంలో మాయదారిరోగాన బారిన పడినోళ్లలో మరణాల రేటు తక్కువగా ఉండటం ఉపశమనం కలిగించే అంశంగా చెప్పాలి. అయితే.. తాజాగా నమోదవుతున్నకొత్త కేసులతో కేరళలో కలకలం రేగుతోంది. తొలిసారి ఏ రీతిలో అయితే.. కఠినమైన పద్దతుతో అణిచివేశారో.. ఈసారి అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తున్నారు. మరి.. ఆగకుండా వస్తున్న వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారితో ఆ రాష్ట్ర సీఎం అనుకున్నట్లు జరుగుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారంది. దీనికి సమాధానం లభించాలంటే.. మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.