కరోనా మృతుల శవాలతో నిండిపోయిన స్పెయిన్!

Update: 2020-04-02 05:55 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చి విలయతాండవం చేస్తూ వేలాది మంది ప్రాణాలని అపహరిస్తుంది. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధించి, ప్రజలను గడప దాటి రాకుండా చేశాయి. ప్రపంచంలోని 200పైగా దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌ అగ్రరాజ్యాల నుంచి పసికూనలను సైతం గడగడలాడిస్తోంది. ప్రపంచంలోనే అగ్రరాజ్యం గా గొప్పలు చెప్పుకునే అమెరికా సైతం కరోనా దెబ్బకి విలవిలలాడుతోంది. కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ అమెరికా మరణాల సంఖ్య తక్కువగా నమోదు అవుతుండటం కొంతలో కొంత శుభపరిణామం.

అయితే, ఈ కరోనా వైరస్ స్పెయిన్ లో మరణ మృదంగం వాయిస్తుంది. ఇప్పటి వరకు స్పెయిన్ లో 104,118 మంది కరోనా భారిన పడగా .. మృతుల సంఖ్య 10 వేల దరిదాపుల్లోకి వచ్చింది. గత వారం రోజులుగా కరోనా స్పెయిన్ లో బీభత్సం సృష్టిస్తుంది. రోజుకు ఆరేడు వేల పాజిటివ్‌ కేసులు.. ఎనిమిది వందలకు తగ్గని మరణాలు. తాగాగా 727 మంది చనిపోవడంతో ఇటలీలో మృతుల సంఖ్య 13,155 వేలకు చేరింది. ఫ్రాన్స్‌, యూకే (563), బెల్జియం (123), నెదర్లాండ్స్‌ (134) సహా యూర్‌పలోనే కరోనా మృతుల సంఖ్య 30 వేలపైగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 47 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజు రోజుకూ మరింత ఉద్ధృతమవుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 400 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు వెలుగుచూసిన తర్వాత మంగళవారం నాడు అత్యధికంగా 300పైగా కేసులు నమోదు కాగా.. బుధవారం ఆ సంఖ్యకు మించి నిర్ధారణ అయ్యాయి. వ్యక్తి నుంచి వ్యక్తికి సోకే స్థాయిని దాటి సామాజిక వ్యాప్తి మొదలైందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 1998 మందికి కరోనా పాజిటివ్ రాగ ...మృతుల సంఖ్య 58 కి చేరింది.
Tags:    

Similar News