ఏపీలో మరో 26.. ఒక్కరోజులో 52 కేసులు

Update: 2020-04-05 14:45 GMT
కరోనా వైరస్‌ ఆంధ్రప్రదేశ్‌ లో వేగంగా విస్తరిస్తోంది. ఇన్నాళ్లు తక్కువ సంఖ్యలో ఉన్న ఆ వైరస్‌ కేసులు మూడు - నాలుగు రోజుల నుంచి పదుల సంఖ్యలో ఉంటున్నాయి. ఏకంగా రోజుకు క్రమక్రమేణా కేసులు పెరుగుతున్నాయి. 10 గంటల్లోపే 34 కేసులు వెలుగులోకి రాగా ఇప్పుడు మరో 26 కేసులు పెరిగాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కల్లోలం రేగుతోంది. వీటి వలన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం 252 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లోని దాదాపు అన్ని జిల్లాలకు కరోనా వైరస్‌ పాకుతోంది. కొత్తగా కర్నూలు జిల్లాలో 26 - నెల్లూరులో 34 - వైఎస్సార్‌ కడపలో 23 - గుంటూరులో 30 - కృష్ణాలో 28 - ఒంగోలులో 23 - చిత్తూరు జిల్లాలో 7 కేసులు నమోదయ్యయాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చింది.

అయితే ఆంధ్రప్రదేశ్‌ లో మొదట తక్కువ సంఖ్యలో ఉన్న కరోనా వైరస్‌ ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో అనూహ్యంగా ఆ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో 90 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిని - వారి కుటుంబసభ్యులను ఐసోలేషన్‌ కేంద్రంలో ఉంచారు. వారికి సత్వరమే వైద్యం అందిస్తున్నారు. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నారు.

అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లో పకడ్బందీగా లాక్‌ డౌన్‌ అమలుచేస్తున్నారు. ఎవరినీ బయట తిరగనీయడం లేదు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సిబ్బంది నిత్యావసర సరుకులు - నగదు సహాయం అందిస్తున్నారు.

Tags:    

Similar News