ఏపీలో కొత్తగా మరో 21 కేసులు..402 కి చేరిన కేసుల సంఖ్య!

Update: 2020-04-11 10:50 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా - మొత్తం ఏపీలో కరోనా పాజిటివ్  కేసుల సంఖ్య 402కి చేరింది. రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి.. శనివారం మధ్యాహ్నం వరకు 1 గంట వరకు నమోదైన కరోనా పరీక్షల్లో.. మరో 21 కేసులు బయటపడ్డాయి. వీటిలో గుంటూరు 14 - కర్నూలు 5.. ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు తాజా బులిటెన్‌ లో ప్రకటించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 11మందికి కరోనా  నెగిటివ్ రావడంతో వారిని  హాస్పిటల్ నుండి  డిశ్చార్జ్ చేశారు.

ఇప్పటివరకు కర్నూలు జిల్లా లో  82 - గుంటూరు జిల్లాలో 72  కేసులు అత్యధికంగా    నమోదు కావడంతో ఆయా జిల్లాల్లో రెడ్ జోన్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక, శ్రీకాకుళం - విజయనగరం జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా కొనసాగుతున్నాయి.  రాష్ట్రంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. నమోదైన కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.

రాష్ట్రంలో కరోనా  మహమ్మారి విజృంభిస్తుండటంతో గుంటూరు జిల్లాలో లాక్‌ డౌన్‌ ను పకడ్బంధీగా అమలు చేసేందుకు పోలీసులు మరిన్ని ఆంక్షలు విధించారు. నగరంలోని 10 ప్రాంతాలను కంటైన్ మెంట్‌ జోన్లుగా ప్రకటించిన అధికారులు.. అక్కడ జనసంచారంపై పూర్తిగా నిషేధం విధించారు.  ఈ కంటైన్ మెంట్‌ జోన్లలో నివసించే వారికీ నిత్యావసర సరుకులు - పాలు వారి ఇంటి వద్దకే తీసుకువెళ్లి  అందివ్వడానికి మొబైల్‌ వాహనాలు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News