ప్రపంచం మొత్తాన్ని కదిలించి వేసిన కరోనా మహమ్మారితో దేశాలకు దేశాలు తీవ్రమైన ప్రభావానికి గురయ్యాయి. ఇప్పటికే మాంద్యం ప్రభావంతో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇబ్బంది పడుతున్న వేళ.. మరిన్ని ఇబ్బందులకు గురి చేసేలా కరోనా విరుచుకుపడింది. కరోనాను కట్టడి చేసేందుకు 21 రోజుల పాటు యావత్ దేశాన్ని లాక్ డౌన్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది తెలిసిందే.
దీంతో.. కేంద్రానికి వచ్చే ఆదాయాలన్ని ఒక్కసారిగా స్తంభించిపోయాయి. దీంతో.. పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది మోడీ సర్కారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది మోడీసర్కారు. ఉత్పత్తి రంగం భారీగా నష్టపోవటం.. దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావటం.. అత్యవసర సేవలు తప్పించి.. మరేమీ పని చేయని నేపథ్యంలో .. ఇప్పటి అవసరాల కోసం కొత్త అప్పు మీద మోడీ సర్కారు ఫోకస్ చేసింది.
2020-21 తొలి త్రైమాసికంలో రూ.4.88లక్షల కోట్లను అప్పుగా తీసుకోవాలని డిసైడ్ చేశారు. కరోనా కారణంగా ఎదురయ్యే ఆర్థిక విపత్తును ఎదుర్కోవటానికి వీలుగా ఈ భారీ అప్పు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు చెబుతున్నారు. తాజాగా తీసుకునే అప్పుతో.. కొత్త ఆర్థిక సంవత్సరం లో స్థూల రుణాలు ఏకంగా రూ.7.8లక్షల కోట్లుగా మారనున్నాయి. 2019-20లో ఈ అప్పులు రూ.4.99లక్షల కోట్లుగా ఉండేవి.