ట్రంప్ మళ్లీ మళ్లీ అదే మాట
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో కూడా కొందరు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంను తన రాజకీయ అవసరాలకు వినియోగించుకునేందుకు చూస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి నుండి కూడా చైనా తీరును తప్పుబడుతూ వస్తున్న ట్రంప్ మరోసారి కరోనా విషయమై చైనాను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. కరోనాకు పూర్తి బాధ్యత చైనాదే అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నాడు.
ట్రంప్ గతంలో పలు సార్లు చైనాపై ఆరోపణలు చేస్తూ వ్యాఖ్యలు చేయడం.. వాటిని చైనా కొట్టి పారేయడం చేస్తూ వస్తోంది. కరోనా వైరస్ ను చైనా వైరస్ అని.. చైనా వారు కావాలని పుట్టించిన వైరస్ అంటూ అమెరికా అధ్యక్షుడు అంటున్నాడు. అయితే అమెరికా నిఘా వర్గాలు మాత్రం ఈ వైరస్ ను చైనా పుట్టించింది కాదని సహజంగా వచ్చిందని తేల్చారు. కాని ట్రంప్ మాత్రం వారితో ఏకీభవించడం లేదు.
తాజాగా మరోసారి ట్రంప్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరంలోనే జన్మించింది. అందుకు సంబంధించిన శాస్త్రీయ సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయన్నాడు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని బయట పెడతామంటూ ట్రంప్ అన్నాడు. చైనా చేసిన పనికి ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఈ సమయంలో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో వివాదాన్ని రాజేస్తున్నాయి.