కరోనా వైరస్... చైనాలోని వుహాన్ సిటీలో గతేడాది డిసెంబర్ లో మొదటిసారిగా వెలుగుచూసిన ప్రాణాంతక మహమ్మారి - ప్రస్తుతం ప్రపంచంలోని 205 దేశాలకు వ్యాప్తిచెంది - ఇంకా రోజు రోజుకూ తన వేగాన్ని పెంచుకుంటూ పోతుంది. ఈ కరోనా దెబ్బకి ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు లాక్ డౌన్ లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అగ్రరాజ్యంలో రోజురోజుకీ వేల సంఖ్యల్లో కరోనా కేసులు - మరణాలు నమోదవుతున్నాయి. USA లో కరోనా కేసులు ఇప్పటికే 3లక్షలు దాటాయి. అలాగే 9,618 మంది మరణించారు.
అత్యధికంగా న్యూయార్క్ లో 1లక్షా 14వేలకి పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత న్యూజెర్సీ లో 34వేలకి పైగా కేసులు నమోదయ్యాయి. మిచిగాన్ లో 14వేల 225 కేసులు నమోదయ్యాయి. ఇక కాలిఫోర్నియా లో కూడా 13వేల 927 కేసులు నమోదయ్యాయి. ఫ్లోరిడాలో కూడా 11వేల కేసులు నమోదయ్యాయి. ఇక అమెరికాలో కరోనా మరణాల విషయానికొస్తే...మరణాల విషయంలో కూడా న్యూయార్క్ మొదటి స్థానంలో ఉంది. ఒక్క న్యూయార్క్ లోనే ఇప్పటి వరకు 3వేల 565 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత న్యూజెర్సీ లో అత్యధికంగా 846 మరణాలు నమోదయ్యాయి.
కరోనా వెలుగులోకి వచ్చిన చైనా - కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీ - స్పెయిన్ దేశాల కంటే కూడా అమెరికాలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం అమెరికన్లలో ఆందోళన కలిగిస్తొంది. దీనిపై అక్కడి అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. USA లో ప్రయాణాలపై ఆంక్షలు విధించే ముందే చైనా నుండి అమెరికాకి 4 . 30 లక్షల మంది అమెరికా రాగా ..ఒక్క వుహాన్ నగరం నుండే వేల సంఖ్యలో వచ్చినట్టు న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. అలాగే వుహాన్ లో కరోనా భయంకరంగా ఉన్న సమయంలోనే 1300 విమానాల్లో 17 నగరాలకు చైనీయులు వచ్చినట్లు తెలిపింది.