తెలంగాణ‌లో అనూహ్యంగా పెరిగిన కేసులు: ఒక్క‌రోజే 31 పాజిటివ్‌

Update: 2020-05-09 17:31 GMT
తెలంగాణ‌లో ఇన్నాళ్లు త‌క్కువ సంఖ్య‌లో న‌మోద‌వుతున్న క‌రోనా పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. శ‌నివారం ఒక్క‌రోజే 31 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వారం రోజుల వ్య‌వ‌ధిలో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వ‌డం తొలిసారి. వీటితో క‌లిపి మొత్తం కేసులు 1,163కి చేరాయి. ఈ మేర‌కు తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది.

ఈ కేసుల్లో 30 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కాగా - ఓ వలస కూలీకి కరోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించింది. తాజాగా 24 మంది హైద‌రాబాద్‌‌ లోని గాంధీ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్యాయి. వీరితో క‌లిపి డిశ్చార్జైన వారి సంఖ్య‌ మొత్తం 751కి చేరింది. ప్ర‌స్తుతం 382 కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వైర‌స్ బారిన ప‌డి 30 మంది మృతి చెందిన‌ట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది.

ఒక్క‌సారిగా పాజిటివ్ కేసులు పెర‌గ‌డంతో క‌ల‌వ‌రం మొద‌లైంది. అయితే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు భారీగా చేస్తే మ‌రికొన్ని కేసులు వెలుగులోకి వ‌స్తాయ‌ని ప‌లువురు చెబుతున్నారు. కేసులు పెర‌గ‌డంతో హైద‌రాబాద్‌ లో ఇచ్చిన స‌డ‌లింపులు వెన‌క్కి తీసుకునే అవ‌కాశం ఉంది. సీఎం కేసీఆర్ ప్రెస్‌ మీట్ నిర్వ‌హించిన అనంత‌రం ఇంత పెద్ద సంఖ్య‌లో కేసులు న‌మోద‌వ‌డం మొద‌టిసారి. రోజువారీ స‌మీక్ష నిర్వ‌హిస్తున్న కేసీఆర్ మ‌రి తాజాగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచిచూడాలి.


Tags:    

Similar News