నేరం చేయలేదు కానీ..మేజిస్ట్రేట్ వారెంట్ ఇష్యూ చేశారెందుకు?

Update: 2020-02-05 12:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భయాందోళనలు భారత్ లోనూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయన్న సందేహం ఉన్న వ్యక్తికి సంబంధించిన ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పంజాబ్ లోని ఫరీదాబాద్ కుచెందిన 38 ఏళ్ల వ్యక్తి ఒకరు ఇటీవల కెనడాలో ఉంటారు. తాజాగా ఆయన భారత్ వచ్చారు. కెనడాలో బయలుదేరిన ఆయన విమానం మార్గమధ్యంలో చైనాలోని షాంఘైలో కొన్ని గంటల పాటు ఆగింది. తర్వాత భారత్ కు వచ్చాడు.

అనంతరం అతను అస్వస్థతకు గురయ్యాడు. ఇంటికి దగ్గర్లోని ఆసుపత్రిలో చేరగా.. అతడి రోగ లక్షణాలు కరోనాను పోలి ఉన్నాయి. దీంతో అతనికి ప్రత్యేకమై చికిత్స అందించేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. అయితే.. అందుకు ఆ వ్యక్తి నో చెప్పారు. తాను ఐసోలేషన్ వార్డులో జాయిన్ అయ్యేందుకు నిరాకరించారు. దీంతో.. ఈ విషయం పోలీసుల వద్దకు వెళ్లటం.. అనంతరం జడ్జి వద్దకు వెళ్లగా.. సదరు వ్యక్తిని ఐసోలేటెడ్ వార్డులోకి మార్చాలని ఆదేశాలు జారీ చేశారు.

అయినప్పటికీ అతను ఒప్పుకోకుంటే మాత్రం అతన్ని అరెస్టు చేసైనా ప్రత్యేక వార్డుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. విషయం తెలిసిన సదరు వ్యక్తి తనకు తానుగా ఐసోలేషన్ వార్డులో చేరేందుకు ఒప్పుకున్నారు. దీంతో.. అతని మీద జారీ చేసిన వారెంట్ ను రద్దు చేశారు. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు.
Tags:    

Similar News