కండోమ్ కోసం కక్కుర్తి పడిన జంట.!

Update: 2019-11-18 11:26 GMT
శృంగారం దివ్యౌషధం అంటారు. అందుకే ఇప్పుడు అందరూ ఆరోగ్యం, అందం కోసం శృంగారాన్ని సాధనంగా వాడుతున్నారు. అనుభవిస్తున్నారు. కానీ అవగాహన లేక కొంత మంది లేని ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

శృంగారంలో ప్రయోగాలు చేయాలి.. కానీ అరక్షిత ప్రయోగాలు చేస్తే శృంగారంలో ఎంత డేంజరో చెప్పే ఘటన ఒకటి చోటుచేసుకుంది. మెడికల్ షాప్ నకు వెళ్లి కండోమ్ కొనడానికి సిగ్గు పడిన ఓ జంట ఏకంగా ప్లాస్టిక్ కవర్ ను కండోమ్ గా వాడి చేసిన ప్రయోగం వికటించింది. వారికి ఎలాంటి పరిణామాలకు దారితీసిందో చెప్పడం కష్టమే.. మీరే కింద చదివేయండి..

వియత్నాం దేశంలోని హనోయ్ ప్రాంతానికి చెందిన ఓ జంట శృంగారంలో తనివితీరా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసింది.కానీ గర్భం వస్తుందని భయంతో కండోమ్ వాడాలని అనుకుంది.కానీ మెడకల్ షాప్ కు వెళ్లి కొనడం సిగ్గుగా భయంగా అనిపించింది. దీంతో కండోమ్ బదులుగా ప్లాస్టిక్ కవర్ ను వాడారు..

శృంగారంలో కొత్తలో ఉద్రేకంతో ప్లాస్టిక్ తో పని కానిచ్చారు. కానీ కొద్ది సేపటి తర్వాత ఇద్దరికీ మంటపుట్టింది. ప్లాస్టిక్ కవర్ వల్ల వారి జననేంద్రియాలు దెబ్బతిన్నాయి.. రక్తస్రావమయ్యాయి. దీంతో వెంటనే వైద్యుల వద్దకు పరిగెత్తారు.

ఇలా అవగాహన లేకుండా ఏదీ పడితే అది సున్నితమైన జననేంద్రియాల్లో వాడడం డేంజర్ అని వైద్యులు సూచిస్తున్నారు. కండోమే వాడాలని సూచిస్తున్నారు.

 వియాత్నం దేశంలో సెక్స్ నాలెడ్జ్ అక్కడి యువతకు చాలా తక్కువని హనోయ్ మెడికల్ యూనివర్సిటీ, హనోయ్ మెడికల్ కాలేజ్ లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. 2700 విద్యార్థులను కండోమ్ వాడకంపై ప్రశ్నిస్తే కేవలం 16శాతం మంది మాత్రమే కండోమ్ వాడామని తెలిపారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కండోమ్ కొనడానికి తమకు సిగ్గు అని వాడలేదని 25శాతం మంది తెలిపారు. ఇలా కండోమ్ కోసం కక్కుర్తిపడిన జంట చివరకు ఆస్పత్రిపాలైంది.
Tags:    

Similar News