జేసీ బ్రదర్స్ కు కోర్టులో మరో షాక్ తగిలింది. వారిద్దరూ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఇప్పట్లో కానరావడం లేదు. జేసీ ట్రావెల్స్ బస్సుల అక్రమాల్లో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు బెయిల్ నిరాకరిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వారిని విచారణకు పోలీసులకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.
జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలు అరెస్ట్ అయిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ తర్వాత తొలిసారి బెయిల్ ప్రయత్నాలు చేశారు జేసీ తండ్రీకొడుకులు. ఈ నేపథ్యంలోనే కోర్టు వారికి షాకిచ్చింది. ఇక మూడు రోజుల కస్టడీ కోరిన పోలీసులకు కేవలం రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్ కు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీలో నిరసన తెలిపారు. అసెంబ్లీని బహిష్కరించారు. లోకేష్ బాబు స్వయంగా వచ్చి జేసీ ఫ్యామిలీని పరామర్శించింది.
అయితే కోర్టులో టీడీపీ వాదిస్తున్న అక్రమ అరెస్ట్ అన్న వాదన నిలబడలేదు. కోర్టు రాజకీయ కక్ష సాధింపులు అని బెయిల్ వస్తుందని ఆశపడ్డ జేసీ ఫ్యామిలీకి, టీడీపీకి భంగపాటు తప్పలేదు. కోర్టు జేసీ తండ్రీకొడుకుల విచారణకు ఆదేశించడంతో ఏం బయటపడుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.