ట్రంప్‌ కు కోర్టు షాక్‌..మ‌నోళ్ల‌కు తీపిక‌బురు

Update: 2018-01-12 06:42 GMT
శ‌ర‌ణార్థులు....అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు అస్స‌లు న‌చ్చ‌ని ప‌దం. వ‌ల‌స‌దారుల‌న‌యినా... డ్రీమ‌ర్స్ పేరుతో అనుమ‌తితో చిన్న‌త‌నంలో త‌ల్లిదండ్రుల వెంట‌ వ‌చ్చిన వారయిన పేరు ప్ర‌స్తావించ‌గానే ట్రంప్ నిప్పులు చెరుగుతుంటారు. అయితే ఇదే విష‌యంలో ట్రంప్‌ సర్కార్‌ కు యూఎస్‌ కోర్టులో చుక్కెదురైంది. త‌ద్వారా ఈ నిర్ణయం వల్ల దాదాపు 7000 మంది ఇండియన్ అమెరికన్లతో సహా మొత్తం 8,00,000 మంది భవిష్యత్తు దెబ్బతినే ప్ర‌మాదం త‌ప్పింది.
 
డాకా (డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌ హుడ్‌ అరైవల్స్‌) డ్రీమర్‌ స్కీమ్‌ ని ఎత్తి వేయాలని యూఎస్‌ ప్రభుత్వం సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. దీంతో, 8లక్షల మంది ఇబ్బందులు పడటం ఖాయ‌మ‌ని తేలింది. అయితే డాకా డ్రీమర్‌ స్కీమ్‌ ని ప్రభుత్వం కొనసాగించేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థిస్తూ పలువురు బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈకేసును విచారించిన యూఎస్‌ కోర్టు డాకా డ్రీమర్‌ స్కీమ్‌ ఎత్తివేతపై స్టే ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఇమ్మిగ్రెంట్స్‌ ను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని శాన్‌ ఫ్రాన్సిస్కో న్యాయమూర్తి విలియమ్‌ అల్‌ సప్‌ ట్రంప్‌ సర్కార్‌ ను ఆదేశించారు.

కాగా, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చినవారి పిల్లల రక్షణ కోసం 2012లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా డాకా డ్రీమర్‌ స్కీమ్‌ ని ప్రవేశపెట్టారు. ఈస్కీమ్‌ ప్రకారం...30 ఏళ్ల‌ లోబడిన‌ వారంతా తమ వ్యక్తిగత సమాచారాన్ని యూఎస్‌ డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ సెక్యూరిటీకి అందజేయాలి. ప్రతీ రెండేళ్ల‌కు ఒకసారి వ్యక్తిగత సమాచారాన్ని అధికారులు సేకరించి పరిశీలిస్తారు. ఒబామా ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌ ని రద్దు చేయనున్నట్టు గతేడాది సెప్టెంబర్‌ లో ట్రంప్‌ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి5 నుంచి డాకా డ్రీమర్‌ స్కీమ్‌ లో పేర్లు నమోదు చేసుకున్నవారి దరఖాస్తులను రెన్యువల్‌ చేయబోమని - కొత్త దరఖాస్తులను స్వీకరించమని అధికారులు ప్రకటించారు. ఈనేపథ్యంలో పలువురు బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేప‌థ్యంలో న్యాయ‌స్థానం ట్రంప్‌ కు వ్య‌తిరేకంగా తీర్పిచ్చింది.
Tags:    

Similar News