ఒకరిపై ఒకరికి కోపతాపాలు.. ద్వేషాలు ఉండొచ్చు. కానీ.. పెద్దోళ్ల పగకు చిన్నారిని బలి తీసుకోవటం ఒక దుర్మార్గమైతే.. మాటల్లో చెప్పలేనంత.. నాగరిక మనుషులన్నోళ్లు చేయలేనంత దారుణంగా.. పైశాచికంగా చంపేసిన తీరు చూస్తే.. మనుషుల రూపంలో ఉన్న మృగాలుగా చెప్పక తప్పదు. ఏడాదిన్నర క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతం జమ్ముకశ్మీర్ లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
జమ్ముకశ్మీర్ లోని కథువా గ్రామానికి చెందిన 8ఏళ్ల చిన్నారిని అతి పాశవికంగా.. భయానకంగా అత్యాచారం చేసి చంపేసిన ఉదంతంలో ప్రధాన నిందితుడు సాంజీ రామ్ తో పాటు.. ఇద్దరు పోలీసు అధికారులు (దీపక్ ఖజురియా.. సురేందర్ వర్మ.. హెడ్ కానిస్టేబుల్.. మరో ఇద్దరు పోలీసు అధికారులను కూడా పఠాన్ కోట్ కోర్టు దోషులుగా తేల్చింది. అదే సమయంలో సాంజీ రామ్ కొడుకు విశాల్ ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది.
దోషులుగా తేల్చిన వారికి మరికాసేపట్లో శిక్షలు ఖరారు చేయనున్నారు. 2018 జనవరి 10న గుర్రాల్ని మేపటానికి వెళ్లిన ఎనిమిదేళ్ల చిన్నారి కనిపించలేదు. ఆ పాప తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించటం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇది జరిగిన వారం తర్వాత అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టు మార్టం రిపోర్ట్ లో అత్యంత దారుణంగా బాలికపై సామూహిక అత్యాచారాన్ని చేసినట్లుగా వెల్లడించారు.
ఈ ఉదంతంలో మరో షాకింగ్ అంశం ఏమంటే.. ఒక చిన్న భూ వివాదం కారణంగా బాలిక తల్లిదండ్రుల మీద పగ తీర్చుకోవటానికి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. పాపను చంపేసిన అనంతరం.. ఈ విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు పలువురు పోలీసు అధికారులకు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారు. అనంతరం ఈ ఉదంతం పెద్దది కావటం.. ఉన్నతాధికారులు దృష్టి సారించటంతో మొత్తం గుట్టురట్టు అయ్యింది. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ ఉదంతం పలువురి కంట తడి పెట్టించింది. అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారికి నరకయాతన పెట్టిన రాక్షసుడికి.. అతడికి సహకరించిన వారికి ఏమేం శిక్ష విధిస్తారో చూడాలి.