హిందువుల మనోభావాలు దెబ్బ తీసిన ఉదంతానికి సంబంధించి అనంతపురం కోర్టులో టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై ఒక కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు వాయిదాకు రాని నేపథ్యంలో అతడిపై నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇష్యూ చేయటం ఆ మధ్యన చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఆ కేసు విచారణకు ధోనీ తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. ధోనీపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ను ఉపసంహరించుకోవాలంటూ కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు.. అరెస్ట్ వారెంట్ ను ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. ఒక మ్యాగ్ జైన్ మీద హిందు దేవుడి ధోనీ ఫోటోను అచ్చేసిన సంగతి తెలిసిందే.