నెక్ట్స్ టార్గెట్? కుమారస్వామికి కోర్టు నోటీసులు!

Update: 2019-09-07 01:30 GMT
భారతీయ జనతా పార్టీ వ్యతిరేక రాజకీయ నేతలకు న్యాయస్థానాల చికాకులు కొనసాగుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే  చిదంబరం తిహార్ జైలును చేరుకున్నారు. బీజేపీ గత ఐదేళ్ల టర్మ్ లో చిదంబరం తనయుడు తిహార్ జైల్లోని ఏగదిలో ఉన్నాడో, ఇప్పుడు చిదంబరం అదే గదిలో ఉన్నారట.
 
ఒకనాడు దేశ ఆర్థిక మంత్రిగా, హోం మంత్రిగా.. మోస్ట్ పవర్ ఫుల్ గా చలామణి అయిన చిదంబరం..ఇప్పుడు ఖైదీగా మారారు. ఎంతోమందిని రాజకీయ కక్ష సాధింపులతో జైళ్లకు  పంపాడనే పేరును కలిగి ఉన్న ఆయన ఇప్పుడు తన అరెస్టు  రాజకీయ కక్షసాధింపు అని అంటున్నారు. మరి గతంలో వీళ్లు చేసింది శుద్ధంగాఉంటే ఇప్పుడు బీజేపీపై విమర్శల వాడి పెరిగేది.

ఇక కాంగ్రెస్ కు కర్ణాటకలో పెద్ద దిక్కుగా ఉండటంతో పాటు..వివిధ సందర్భాల్లో సోనియాకే అండగా నిలిచిన డీకే శివకుమార కూడా జైల్లో ఉన్నారు. ఈడీ కేసులతో చాన్నాళ్లుగా విచారణను ఎదుర్కొంటున్న ఆయన చివరకు  అరెస్టు అయ్యారు.

బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో డీకే శివకుమార చాలా యాక్టివిటీస్ చేశారు. దానికి కక్ష సాధింపుగానే ఆయన అరెస్టు జరిగిందని కమలనాథులు అంటున్నారు.  ఆ సంగతలా ఉంటే.. తాజాగా కర్ణాటక మాజీ  సీఎం కుమారస్వామికి కోర్టు నోటీసులు అందాయట. ఒక భూ వ్యవహారంలో కుమారస్వామి నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ సమన్లు జారీ అయ్యాయి.

ఇది పన్నెండేళ్ల కిందటి వ్యవహారం. గతంలో కుమారస్వామి సీఎంగా ఉన్నప్పుడు రెండెకరాల భూ కేటాయింపులపై తీసుకున్న నిర్ణయంపై లోకాయుక్త వద్ద నమోదైన ఫిర్యాదు పై కోర్టు స్పందిస్తూ.. ఆయనకు నోటీసులు జారీ చేసింది. రెండెకరాల భూ వ్యవహారమే అయినా.. ఇది ఎక్కడి వరకూ వెళ్తుందనేది ఆసక్తిదాయకంగా మారింది.
Tags:    

Similar News