వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కొందరు కోవర్టులు తయారయ్యారా.. ప్రభుత్వంలో తమకు నచ్చని వారి గురించి తప్పుడు లీకులను ఇవ్వడానికి కూడా వారు వెనుకాడటం లేదా! సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా చలామణిలో ఉన్న వ్యక్తే ఒకరు ఇప్పుడు అలాంటి లీకులు ఇస్తున్నారా? తెలుగుదేశం పార్టీ వర్గాలకు సమాచారం ఇచ్చి - వారి చేత మాట్లాడించే వ్యూహాలను ఆయన అమలు పెడుతూ ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయిప్పుడు!
గతం నుంచి జగన్ కు సన్నిహితంగా మెలిగి - జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆయనకు ప్రభుత్వంలో మంచి పోస్టు ఇచ్చారు. అయితే.. ఆయన అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉన్నారని సమాచారం. అందులో భాగంగా ప్రభుత్వంలో తనకు నచ్చని కొంతమంది గురించి ఆయన తప్పుడు సమాచారాన్ని తెలుగుదేశం వర్గాలకు అందిస్తున్నట్టుగా భోగట్టా.
తెలుగుదేశం పార్టీ వాళ్లకు తెలియని - అవగాహన లేని అంశాలను వారికి చెప్పి - ప్రభుత్వంలో ఏదో జరిగిపోతున్నట్టుగా వారి చేత మాట్లాడిస్తూ ఉన్నారట. ఆ మాటలను మళ్లీ జగన్ వద్దకు తీసుకెళ్లి.. తనకు నచ్చని వారి పై ఆయన ఫిర్యాదులు చేస్తూ ఉన్నారని టాక్!
ఇలా పార్టీలో - ప్రభుత్వంలో తనకు నచ్చని వ్యక్తులను దెబ్బతీయడానికి ఇలా ఏకంగా టీడీపీ మౌత్ పీస్ లకే సదరు వ్యక్తి సమాచారాలు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. జగన్ కు అతి సన్నిహితంగా మెలుగుతూ.. ఆయన అలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారని - పార్టీలోని కొంతమంది వాపోతూ ఉన్నారు. ఇలాంటి వారిని జగన్ గుర్తిస్తే మంచిదనే సూచనలు చేస్తూ ఉన్నారు!