అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్నాళ్లు తన నిర్ణయాలతో కలకలం సృష్టిస్తుంటే....తాజాగా ఆయన ఒక్క పదం వాడటంతో పిచ్చెక్కించారు. తాజాగా ఆయన ఓ కొత్త ఇంగ్లిష్ పదాన్ని కనిపెట్టారు. అలా ట్రంప్ ట్విట్టర్ లో కనిపెట్టిన పదం మూడు కోట్ల మందిని దిమ్మతిరిగే స్థాయికి చేర్చింది. ఆయన పోస్ట్ చేసిన ఆ పదానికి అర్థం ఏంటో తెలియక ట్రంప్ మూడు కోట్ల మంది ఫాలోవర్లు తికమక పడ్డారు. కొందరు సెటైర్లు వేశారు.
covfefe అనే ఓ వింత పదాన్ని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇది చూసి నెటిజన్లకు దిమ్మ తిరిగిపోయింది. దీనిని లక్షా పది వేల మంది రీట్వీట్ చేశారు. ప్రెస్ కవరేజ్ బదులు స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అలా టైప్ చేసి ఉంటారని కొందరంటే.. రాత్రి బాగా తాగిన మైకంలో ఈ ట్వీట్ చేశారని మరికొందరు అనడం గమనార్హం. మొత్తానికి ట్రంప్ సృష్టించిన ఈ కొత్త పదం ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్నది. అయితే దీనికి ట్రంప్ ఎలాంటి రిప్లై ఇంకా ఇవ్వలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/