కరోనా మాహమ్మారి ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడింది. దీనివల్ల చాలామంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులయ్యారు. ఎంతోమందికి తినడానికి తిండి దొరకలేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేసుకునే వారికి నిలువ నీడ లేకుండా మారింది. అయితే కొన్ని రంగాల్లో మాత్రం దీని ప్రభావం ప్రతికూలంగా లేదని తెలుస్తోంది. ముఖ్యంగా కొవిడ్ కాలంలో టెక్ ఉద్యోగాలు పెరిగాయని ఓ సర్వేలో వెల్లడైంది.
కరోనా కాలంలో సాంకేతిక రంగంలో ఉద్యోగాలు గణనీయంగా పెరిగాయని సర్వేలో తెలింది. వ్యాపారలన్నీ దాదాపు ఆన్ లోన్ కి విస్తరించడంతో సాంకేతికతో ఆధారంగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఫీల్డ్ ఇంజనీర్, సేల్స్ లీడ్, ఎడిటర్ వంటి పోస్టులకు డిమాండ్ అధికమైంది. సాంకేతిక రంగాల్లోని సమస్యలను దాదాపు పరిష్కరించడం ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యాయని సర్వేలో వెల్లడైంది. బెంగళూరు, చెన్నై, ముంబయి, హైదరాబాద్, కోల్‌కతా, పుణె, దిల్లీ వంటి మెట్రో నగరాల్లో టెక్ జాబ్ లు విపరీతంగా పెరిగాయని అంచనా వేసింది.
అప్లికేషన్ డెవలపర్, సేల్స్‌ఫోర్స్ డెవలపర్, లీడ్ కన్సల్టెంట్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ వంటి నైపుణ్యం గల సాంకేతిక ఆధార ఉద్యోగాలకు మంచి గిరాకీ ఉందని గ్లోబల్ జాబ్ సైట్ ఇన్ డీడ్ వెల్లడించింది. 2020 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి కాలంలో ఏర్పడిన టెక్ ఉద్యోగాల డేటా ఆధారంగా ఈ నివేదిక తయారు చేసినట్లు ఆ సంస్థ వివరించింది. ఈ సమయంలోనే 150-300వృద్ధిరేటు నమోదైందని స్పష్టం చేసింది.
కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోం సౌకర్యం ఉండడం వల్ల ఈ రంగంలోని ఉద్యోగులకు పెద్దగా నష్టాలు వాటిల్లలేదని స్పష్టం చేసింది. దేశీయ కార్యకలాపాల్లో 9శాతం క్షీణత ఉందని వెల్లడించింది. కానీ సాంకేతిక ఆధారంగా ఉపాధి అవకాశాలు పెరిగాయని ఇవి భవిష్యత్ లో మరింతగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. భారత్ సాంకేతికత వైపు శరవేగంగా దూసుకుపోతున్న తరుణంలో ఇది మంచి పరిణామమేనని సాంకేతిక నిపుణులు అంటున్నారు.