మహమ్మారి టీకా.. అంతమందిని కొత్త కుబేరుల్ని చేసిందట

Update: 2021-05-20 17:30 GMT
ఒకడి కష్టం.. మరొకరికి సంపదగా మారుతుందన్న మాట వింటే విస్మయానికి గురవుతాం. కానీ.. ఇది నిజం. కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది మంది ఇబ్బందులకు గురి కావటమే కాదు.. ఆర్థికంగా పెద్ద ఎత్తున దెబ్బ తిన్నారు కూడా. లక్షలాది సంస్థలకు భారీ నష్టాల్ని తెచ్చి పెట్టిన ఈ మహమ్మారి.. ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త కుబేరులు అవతరించేలా చేసింది. విపత్తు కొత్త అవకాశాల్ని తీసుకొస్తుందనటానికి నిదర్శనంగా కొవిడ్ నుచెప్పాలి.

కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు లాభాల పంట పండుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు టీకా కనిపెట్టిన కంపెనీలు తాజాగా కొత్త బిలీయనీర్ జాబితాలో చేరటం గమనార్హం. టీకాలు తీసుకొచ్చిన లాభాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్లలో కొత్తగా తొమ్మిది మంది చేరినట్లుగా ‘ది పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్’ అనే సంస్థ వెల్లడించింది.

ఫోర్బ్స్ రిచ్ లిస్టు ఆధారంగా ఈ తొమ్మిది మంది కొత్త బిలియనీర్ల నికర సందప ఏకంగా 19.3 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. అంతేకాదు.. ఇప్పటికే బిలియనీర్ల జాబితాలోఉన్న మరో ఎనిమిది మంది నిరక సంపద టీకా ఆదాయం తర్వాత 32.2 బిలయన్ డాలర్లకు పెరిగినట్లు తెలిపింది.

కొత్తగా కుబేరుల జాబితాలో చేరిన వారిలో మోడెర్నా సంస్థ సీఈవో స్టీఫెన్ బాన్సెల్.. బయో ఎన్ టెక్ వ్యవస్థపాకుడు ఉగర్ సహిన్ ఉన్నారు. చైనా టీకా కంపెనీ కాన్ సినో బయోలాజిక్స్ సహ వ్యవస్థాపకులతో పాటు మరో ముగ్గురు కూడా కొత్త జాబితాలో చేరారు.

ప్రపంచాన్ని వణికించిన కరోనా.. కొందరికి ఎంతలా కాసుల వర్షం కురిపిస్తుందో కదా?  కొత్తగా బిలీయనీర్ల జాబితాలో చేరి వారి మొత్తం సంపదతో తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోని అందరి ప్రజలకు 1.3రెట్ల టీకాలు అందించొచ్చన్న అంచనాను విన్నప్పుడు.. టీకా సంస్థలు తమ లాభార్జానను కాస్త పక్కన పెడితే ప్రపంచ ప్రజలు మరింత సంతోషంగా.. ఆరోగ్యంగా ఉంటారన్న భావన కలుగక మానదు. కాసుల వర్షాన్ని.. సాదాసీదా జనం కోసం త్యాగం చేసేంత పెద్ద మనసు కార్పొరేట్ కంపెనీలకు ఉండదు కదా?
Tags:    

Similar News