కోవిషీల్డ్‌ టీకా ఎగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

Update: 2021-11-22 05:35 GMT
కరోనా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి, కరోనా వ్యాక్సిన్ అందని దేశాలకు సహాయం చేసేందుకు కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వ్యాక్సిన్ అందని దేశాలకు బాసటగా నిలచేందకు ఐరాస ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా వ్యాక్సిన్లను సేకరించిన పేద దేశాలకు సహాయం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఐక్య రాజ్యసమితి ఏర్పాట్లు చేస్తోంది.

ఈ క్రమంలో భారత ఫార్మ దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కింద 50 లక్షల డోస్ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ ను నేపాల్, తజికిస్తాన్, మొజాంబిక్‌ లకు ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి.

పుణెకు చెందిన సీరం సంస్థ 24,89,15,000 డోస్‌ల స్టాక్‌ ను తయారు చేసిందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలోని ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇటీవల తెలిపింది.

వాటిని వేగంగా పంపిణీ చేయకుంటే మా కంపెనీకి శీతల గిడ్డంగులు, మానవ వనరుల పరమైన అవాంతరాలు ఎదురవుతాయని, కావున ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని కోవ్యాక్స్‌ కార్యక్రమంలో భాగంగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, తజికిస్తాన్‌, మొజాంబిక్‌ దేశాలకు 50 లక్షల టీకా డోసుల ఎగుమతికి అనుమతి మంజూరు చేయాలని కోరింది.

దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించి అనుమతిచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా వ్యాక్సిన్‌ మైత్రి కార్యక్రమం ద్వారా గతంలో కూడా భారత్‌ వ్యాక్సిన్‌ ను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. దీంతో మరోసారి భారత్‌ వ్యాక్సిన్‌ ఎగుమతి దారుగా ప్రపంచ దేశాల సరసన నిలవనుంది. భారత ప్రభుత్వం వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్‌ లకు 10 లక్షల చొప్పున కోవిషీల్డ్ డోస్‌లను ఎగుమతి చేయడానికి సీరం ఇనిస్టిట్యూట్ కు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే..



Tags:    

Similar News